
సాలూరు పట్టణంలో హైందవధర్మసేన మరియు జనసేన సేవాదళ్ వారి ఆధ్వర్యంలో మట్టి గణపతిలు పంపిణీ
ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో బాధపడుతోంది. ఇటువంటి సందర్భంలో ఉత్సవాలు, జాతరలు జరుపుకునే పరిస్థితి లేదు. హిందూ ప్రజలకు అత్యంత ప్రీతిమైన పండుగ అయిన వినాయకచవితిని ఈ సంవత్సరం జరుపుకునే అవకాశం లేదు. ఎవరికి వారు వారు వాళ్ళ ఇళ్ళల్లో జరుపుకోమని ఇప్పటికే ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసింది. సాలూరు పట్టణంలో హైందవధర్మసేన మరియు జనసేన సేవాదళ్ వారి ఆధ్వర్యంలో మట్టి గణపతి మహాగణపతి కార్యక్రమంలో భాగంగా మట్టి వినాయక ప్రతిమను సాలూరు పట్టణ si శ్రీ ఫక్రుద్దీన్ గారికి అందచేశారు. కరోనా కారణంగా పెద్ద పెద్ద వినాయక ప్రతిమలు భారీ హంగామాలు లేకున్నా కూడా ఎవరి ఇళ్లకు వారే పరిమితమై కేవలం మట్టి గణపతులకు మాత్రమే పూజలు చెయ్యాలి అని సంస్థ సభ్యులు తెలియచేశారు. అందరికి ఇష్టమైన ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరిగే వినాయక చవితి పండుగ ఈ సంవత్సరం వరుకు మాత్రమే పరిమితంగా జరుపుకుని ఆ దేవుని ఆశీస్సులతో కరోనా నిర్ములన జరిగి, వచ్చే సంవత్సరం అంగరంగ వైభవంగా జరగేలా ఆ వినాయకుడు చూసి ప్రపంచంలో అందరిని కరోనా నుండి రక్షించి కాపాడాలి స్వామి అని అందరం ఆ వినాయకుని వేడుకుందాం అని S.I ఫక్రుద్దీన్ గారు ఈ సందర్భంగా తెలియచేశారు.