జనసేన సిద్ధాంతంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులు పంపిణీ
ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో బాధపడుతోంది. ఇటువంటి సందర్భంలో ఉత్సవాలు, జాతరలు జరుపుకునే పరిస్థితి లేదు. హిందూ ప్రజలకు అత్యంత ప్రీతిమైన పండుగ అయిన వినాయకచవితిని ఈ సంవత్సరం జరుపుకునే అవకాశం లేదు. ఎవరికి వారు వారు వాళ్ళ ఇళ్ళల్లో జరుపుకోమని ఇప్పటికే ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసింది. పార్వతీపురం పట్టణం లో జనసైనికులకు మరియు నాయకులకు వినాయకచవితి ఉత్సవాలు సందర్భంగా జనసేన పార్టీ తరుపున మట్టి విగ్రహములను పాత బస్టాండ్ లో పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఉదయము 08 గంటలకు ప్రారంభం చేయడం జరిగింది. జనసేన పార్టీ 7 సిద్దాంతం లలో ఒకటి అయిన పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతు ప్రజలకు మట్టి గణపతి వినాయకులను పంచడం జరిగింది. పర్యావరణ ను కాపాడుదాము అనే నినాదం తో కార్యక్రమం ను జయప చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన జనసైనికులు మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com