అనంతపురం ( జనస్వరం ) : ముక్కోటి అంబిక సేవా చారిటబుల్ ట్రస్ట్ అద్వర్యంలో ఉచితంగా ఫారెన్ లాంగ్వేజ్ కోర్సులు నిర్వహించారు. ఫారెన్ లాంగ్వేజ్ కోర్సు నందు స్పానిష్ మొదటి బ్యాచ్ నందు క్వాలిఫై అయిన విద్యార్థులందరికి ట్రస్ట్ ఛైర్మన్ దంపెట్ల శివ మరియు ట్రస్టీ లావణ్య మాధురి చేతుల మీదగా సర్టిఫికెట్స్ అందజేయడం జరిగింది. దంపేట్ల శివ మాట్లాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా ఉచిత ఫారెన్ కోర్సు ట్రస్ట్ ద్వారా అందిస్తున్నామని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్నీ కోర్సులను ప్రవేశపెడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పానిస్ లాంగ్వేజ్ లెక్చరర్లు, అభిషేక్, ట్రస్ట్ కో ఆర్డినేటర్ రామంజి తదితరులు పాల్గొన్నారు.