వరంగల్, (జనస్వరం) : ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి శ్రీ ఆకుల సుమన్ గారి ఆదేశాల మేరకు గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు బైరి వంశీ కృష్ణ ఆధ్వర్యంలో శివరాత్రి పర్వదినం సందర్బంగా శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి దర్శనముకు వచ్చిన భక్తులకు 450 లీటర్ల మజ్జిగ పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు జన్ను ప్రవీణ్, వస్కులా నిఖిల్ చోప్రా, కన్నెబోయిన రాజు, ఇల్లందుల రాజు, యాదవ్, నవీన్, రోహన్, రామకృష్ణ, సంతోష్, మనోజ్, రాజేష్, రవితేజ, ఘాని, అఖిల్, బంటి, వినయ్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.