గుంతకల్లు, (జనస్వరం) : గుంతకల్ నియోజకవర్గం, గుంతకల్ పట్టణం, స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డు నందు నిరుపేదలకు జనసేన పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా జనసేన శ్రేణులతో కలిసి వాసగిరి మణికంఠ ముఖ్యఅతిథిగా రాయదుర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మంజునాథ గౌడ చేతుల మీదుగా అల్పాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేదవాడి ఆకలి మంటల్లో నుండి పుట్టిన నిస్వార్ధమైన పార్టీ జనసేన పార్టీ అని, గొప్ప ఆశయాలు, సిద్ధాంతాలతో కొణిదెల పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించి నవ సమాజ స్థాపనకు ఎంతో కృషి చేస్తున్నారని, సామాన్యుల పక్షాన నిలుస్తూ తన అద్భుతమైనటువంటి పోరాటపటముతో ఎన్నో ప్రజా సమస్యలన్నీ తీరుస్తూ ముఖ్యంగా యువతను రాజకీయాల వైపు ఆకర్షితుల్ని చేసి, సామాజిక బాధ్యతతో నడవడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నారని, రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వాన్ని బలపరచడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ ముందుకు వెళ్తామని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్, సీనియర్ నాయకులు ఆటో రామకృష్ణ, గాజుల రాఘవేంద్ర, కసాపురం నందా, కత్తుల వీధి అంజి, అఖిల్ రాయల్, రమేష్ రాజ్, అమర్, మంజునాథ్, ఆటో కృష్ణ, సూరి, పరశురాం, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com