
నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ మనుక్రాంత్ గారి నాయకత్వం బలపరుస్తూ 37వ డివిజన్ జిల్లా నాయకులు షాన్వాజ్ గారు కరోనా తీవ్రత 3 దశ విజృంభిస్తున్న నేపధ్యంలో వార్డ్ లో ఉన్న ప్రజలకు ఆనందయ్య కరోనా మందు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది… ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా యువజన విభాగ అధ్యక్షులు కిషోర్ గునుకుల గారు మాట్లాడుతూ కరోనా నివారణకు ప్రజలకు ఉచితంగా ముందు అందిస్తున్న ఆనందయ్య గారికు ప్రభుత్వం తరపున సహకారం అందకపోగా అధికార పార్టీ ప్రతినిధులు దాని గురించి పట్టించుకోని తరుణంలో తన వార్డు ప్రజలు కరోనా వ్యాధి నుండి కాపాడుకోవాలని షాన్వాజ్ గారు తన డివిజన్ లో ఉన్న వాళ్లందరికీ ఆనందయ్య మందును పంచిపెట్టారు. మొదటి నుండి పార్టీ కోసం నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ కష్టపడుతున్న షాన్వాజ్ గారిని తమ డివిజన్లో ప్రజలందరూ ఆదరించి రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి తాము సమస్యలను పరిష్కరించే విధంగా ఉధ్యమించాలని తెలియజేశారు. ఇప్పటి నుంచే కరపత్రాల పై గాజు గ్లాస్ ముద్రవేసి ప్రజల్లోకి తీసుకెళ్తున్న షాన్వాజ్ గారు పార్టీలో ఒక మంచి స్థాయికి రావాలని కోరుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పూసల మల్లేశ్వరరావు గారు, కిషోర్ గునుకుల గారు, షాన్వాజ్ గారు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.