Logo
Date of Publish : 06 July 2022, 5:26 pm
Editor : Sake Naresh

చిరంజీవి 50 రోజుల ముందస్తు జన్మదిన సందర్భంగా బ్లడ్ డొనేట్ కిట్స్, ఫ్రూట్స్ పంపిణీ

             కదిరి ( జనస్వరం ) : కదిరి నియోజకవర్గ జనసేన నాయకులు, చిరంజీవి యువత సభ్యులు మాట్లాడుతూ మనకి ప్రాణం పోసిన ఆ భగవంతుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి మరొకరికి ప్రాణాలు పోసే అవకాశం కల్పించాడని అదే రక్తదానం అని అన్నారు. ఏ దానం చేయాలన్నా అది విద్యా, విజ్ఞానం, డబ్బుతో ముడిపడి ఉంది. కానీ ఒక రక్తదానమే ఓ మంచి మనసుతో ముడిపడి ఉందన్నారు. పద్మభూషణ్ Dr. మెగాస్టార్ చిరంజీవి మాటలను స్ఫూర్తిగా తీసుకొని అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి రక్తదానం చేస్తూ సహాయ సహాకారంగా నిలుస్తున్నామన్నారు.  చిరంజీవి ముందస్తు 50రోజుల పుట్టిన రోజు వేడుకలలో భాగంగా  కదిరి ప్రభుత్వ హాస్పిటల్ నందు ఉన్న రక్తనిధికి " స్ట్రెస్ బాల్స్, ఫ్రూటిలు, ప్లాస్టర్స్ ను రామ్ చరణ్ యువ ఫౌండేషన్ సభ్యుల సహకారంతో హాస్పిటల్ సూపరిడెంట్ హుస్సేన్ కు అందించడం జరిగింది. హుస్సేన్ సారు మాట్లాడుతూ సమాజంలో ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని, ఆయన స్ఫూర్తితో ఎంతో మంది అభిమానులు అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చెయ్యడానికి ముందుకు వస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ అభిమానులు ముందుకు వచ్చి రక్తనిధికి అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కూడా చిరంజీవి ,పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పుట్టిన రోజుల సందర్భంగా కూడా బ్లడ్ క్యాంప్లు ఏర్పాటు చేసి రక్తదానం చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ యువ ఫౌండేషన్ అధ్యక్షులు మనోహర్, జిల్లా జనసేన కార్యక్రమముల కార్యదర్శి కూటాల లక్ష్మణ్, తదితర అభిమానులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com