Logo
Date of Publish : 11 January 2021, 9:56 am
Editor : Sake Naresh

జనసైనికులచే నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ – సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటున్న జనసైనికులు

                          ఒకవైపు పక్కా గృహాలులేక మరోవైపు చలిపులికి తట్టుకోలేక గజగజ వణుకుతూ.. అల్లాడుతూ దుర్భరమైనజీవితం గడుపుతున్న నిరుపేదల పట్ల గొప్ప మానవతా హృదయాలతో స్పందించిన జనసైనికులు దుప్పట్లు పంపిణీ చేసి తమ మానవత్వం చాటుకున్నారు. జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో ఆయన అడుగు జాడల్లో నడుస్తున్న ఎందరో యువతీ, యువకులు చాలా మంది జన సైనికులుగా మారి నిరంతరం జనసేవలో తరిస్తున్నారు. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో మేముసైతం అంటూ ముందుంటూ అభాగ్యులపాలిట ఆపద్భాంధవులై ఆపన్నహస్తం అందిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా, మార్గదర్శకులుగా విశేష సేవలందిస్తున్నారు. ఆదివారం జనసేనపార్టీ కుప్పం నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ శ్రీ ముద్దినేని వెంకటరమణ ఆధ్వర్యంలో శాంతిపురంలో పక్కాగృహాలులేక దయనీయంగా బతుకులు వెళ్ళదీస్తున్న నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన తిరుపతి జనసైనికులు అఖిల్, సర్మిస్తా, లావణ్య, తేజశ్రీ, మునిశంకర్, ప్రవీణ్, మణిదీప్, జీవన్ తదితరులకు మువెర, రామమూర్తి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు రమేశ్ గారు, నవీన్ గారు మరియు మండల అధ్యక్షులు రఘుపతి, ప్రధానకార్యదర్శి వేణు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com