విశాఖపట్నం ( జనస్వరం ) : శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో బుధవారం విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు, నలినీ దేవి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హారతి అమ్మవారి హస్తము రూపంలో కనిపించి ఆ దంపతులకు ఆశీస్సులు అందజేసింది. వచ్చే ఎన్నికలలో జనసేన - టిడిపి కూటమి అధికారంలోకి రావాలని దక్షిణ నియోజకవర్గం లో తాను ఎమ్మెల్యేగా గెలవాలని ఈ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో సుడిగాలి పర్యటనలు చేపట్టారు ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తన కార్యాలయ ప్రాంగణంలో నిరుపేద మహిళలకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ కోరిన వరాలు నెరవేర్చే కల్పవల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మ వారిని దర్శించుకుని ఆమెకు ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని చెప్పారు. ఈ ఆలయానికి విశాఖతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తూ వెళ్తూ ఉంటారని పేర్కొన్నారు. తమ పూజ చేసిన సమయంలో హారతి అమ్మవారు అస్త రూపంలో కనిపించి తమను ఆశీర్వదించిందని వెల్లడించారు. ఇది చాలా సంతోషంగా అలాగే తమ అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. వచ్చే ఎన్నికలలో కచ్చితంగా జనసేన - టిడిపి అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. అలాగే తాను మెజార్టీ ఓట్లతో ఎమ్మెల్యేగా గెలవడం కూడా ఖాయమని ఆయన వెల్లడించారు. నియోజకవర్గంలోని సేవా కార్యక్రమంలో భాగంగా తన కార్యాలయ ప్రాంగణంలో నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com