
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలమేరకు రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలంలో జనసేన వీరమహిళ తులసి గారి ఆధ్వర్యంలో దాదాపు 40 మంది రిక్షా కార్మికులకు, పారిశుద్ధ కార్మికులకు జనసేన పార్టీ తరుపున దుప్పట్లు పంపిణీ చెయ్యడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ మా జనసేన పార్టీ ఎప్పుడూ పదవులకోసం కాకుండా, ప్రజలకోసం పనిచేసే దిశగా ముందుకు వెళ్తుంది అని చెప్పడం జరిగింది. ఈ చలి కాలంలో చలికి బాధపడుతున్న కార్మికులకు ఆసరాగా ఉండాలని వారికి దుప్పట్లు పంచడం జరిగింది. కార్మికులు కూడా అనునిత్యం తమ చమటను ధారపోసి శ్రమైక జీవనం సాగిస్తున్నారన్నారు.