
కూకట్ పల్లి, (జనస్వరం) : నూతన సంవత్సరం సందర్బంగా 100 మంది పేదలకి జనసేనపార్టీ కూకట్ పల్లి నియోజకవర్గం మూసాపేట్ డివిజన్ తరుపున జనసైనికుల ఆధ్వర్యంలో దుప్పట్లు, ఫుడ్ ప్యాకెట్స్ పంచడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త సంవత్సరములో తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సేవా స్పూర్తితో పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత సేవా కార్యక్రమాలు చేస్తూ, సమస్యల మీద పోరాటం చేస్తూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగేంద్ర, సూర్య, గోవర్ధన్, రాము, రతన్, తేజ, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.