Logo
Date of Publish : 18 September 2023, 12:20 am
Editor : Sake Naresh

సూర్యాపేటలో క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ

     సూర్యాపేట ( జనస్వరం ) : తెలంగాణ జనసేన పార్టీ ఆదేశాల మేరకు రామగిరి శివ సాయి ఆధ్వర్యంలో సూర్యాపేట నియోజవర్గం స్థాయి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హుజూర్నగర్ ఇంచార్జ్ సరికొప్పుల నాగేశ్వరరావు పాల్గొనడం జరిగినది. ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లు దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనివిధంగా జనసేన పార్టీ తన కార్యకర్తలకు 5 లక్షల రూపాయల భీమా ఇస్తుందని అన్నారు. రామగిరి శివసాయి మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గంలో 160 మందికి పైగా క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు ఉన్నారని తెలియజేశారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ జనసేన జెండా నియోజకవర్గంలో ఎగురవేసేలా కార్యకర్తలు పని చేయాలని దిశ నిర్దేశించారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి కొంతమంది యువత ఆకర్షితులై పార్టీలో చేరికలు జరిగాయి. క్రియాశీలక సభ్యత్వాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ  కార్యక్రమంలో ఏవి రావు, చింత నాగార్జున, మోదాల శంకర్ యాదవ్, సుంకర రవి కిషోర్, గుడిసె గౌతమ్ రాజ్, శంకర్ నాయక్, మీసాల మహేష్, సిద్దు సాయి, బెల్లి పవన్, రాజ్ కుమార్, లింగా, శ్రవణ్, రేవంత్ మరియు జనసైనికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com