సత్తెనపల్లి, (జనస్వరం) : రాజుపాలెం మండలం ఆదివారం ఉదయం 11 గంటలకు రాజుపాలెం మండల పార్టీ ఆఫీస్ నందు మండల అధ్యక్షుడు తోట నరసయ్య ఆధ్వర్యంలో మండల కమిటీ సమావేశం మరియు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. క్రియాశీల సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమం సత్తెనపల్లి జనసేన పార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావు చేతుల మీదగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తల కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాలుగు మండలాల అధ్యక్షులు రాజుపాలెం మండల అధ్యక్షులు, ముప్పాల మండల అధ్యక్షుడు సిరిగిరి పవన్, సత్తెనపల్లి రూరల్ మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరావు, నకరికల్లు మండల అధ్యక్షులు తాడువారి లక్ష్మి శ్రీనివాస్, రాజుపాలెం మండలం ఉపాధ్యక్షులు బత్తుల హనుమంతరావు, మొక్కపాడు గ్రామ అధ్యక్షులు శీను, రాజుపాలెం గ్రామ అధ్యక్షులు కోటేశ్వరరావు, అనుపాలెం గ్రామ అధ్యక్షులు తోట లక్ష్మీనారాయణ, మండల కార్యదర్శి రుసు వెంకటేష్, పెమ్మా రమేష్, తోట హరిబాబు, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు, జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com