పాలకొండ జనసేన పార్టీ BSU ఆధ్వర్యంలో మంచినీరు సరఫరా ట్యాంకులు 5 పంపిణీ
శ్రీకాకుళం జిల్లా వీరగొట్టం మండలం తెట్టంగి గ్రామం జెడ్పీ హై స్కూల్లో, జనసేన పార్టీ BSU ఆధ్వర్యంలో మంచినీరు సరఫరా ట్యాంకులు 5 పంపిణీ చేశారు. పవన్ కళ్యాణ్ గారు లక్ష్యాలకు అనుగుణంగా పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ గర్భాన సత్తిబాబు గారి ఆదేశాల మేరకు జనసేన BSU భగత్సింగ్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మంచినీరు ట్యాంకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన భగత్ సింగ్ విద్యార్థి విభాగం జిల్లా నాయకుల గర్భాపు నరేంద్ర, మరియు జడ్.పి.హెచ్.ఎస్ తెట్టంగి ప్రధానోపాధ్యాయులు, మరియు స్టాప్, మరియు జనసేన BSU నాయకులు కూర్మా రావు, నారాయణ రావు, యువకులు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.