
చిత్తూరు జిల్లాలో జనసేన ఆధ్వర్యంలో 20 ఆక్సిజన్ సిలిండర్ లు పంపిణీ
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జన్మదిన వారోత్సవాలలో మొదటి రోజు ఆగష్టు 27 గురువారం ఉదయం 11 గంటలకి తిరుపతి ప్రభుత్వ రుయా హాస్పిటల్ కి సుమారు 20 ఆక్సిజన్ సిలిండర్ కిట్లను అందచేస్తున్నామని జనసేన నాయకులు కార్యక్రమ కో-ఆర్డినేటర్ కంచన శ్రీకాంత్ గారు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భముగా కంచన శ్రీకాంత్ గారు మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో ఒకే రోజు ఒకే సమయములో ఈ ఆక్సిజన్ సిలిండర్ లు పంపిణీ చేస్తున్నామని, కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ అందక మరణిస్తున్న అభాగ్యుల ప్రాణాలని కాపాడే ప్రయత్నమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అని తెలిపారు. ఈ బృహత్కర కార్యక్రమానికి జనసైనికులంతా శ్రీకారం చుట్టామని అన్నారు. ఈ విపత్కర పరిస్థితులలో ఇలాంటి కార్యక్రమం చేయాలనే ఆలోచనకి బీజం వేసిన రవి అనురాజుల(విప్లవ తమిళన్)గారికి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం జరిగే ఈ కార్యక్రమంకు కో-ఆర్డినేటర్ లు గా కంచన శ్రీకాంత్ మరియు దేవర మనోహర్ వ్యవహరిస్తారని, ముఖ్య అతిధుల సమక్షంలో రుయా సూపరెండెంట్ కి ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సీమీటర్, ఆక్సిజన్ మాస్కులతో వున్న కిట్లని అందిస్తామని తెలిపారు. సిలిండర్ లు డొనేట్ చేసిన దాతలకు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా జిల్లా నాయకులని, వీర మహిళలని, జనసైనికులని కోరారు.