వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చి 4 ఏళ్ళు గడిచినా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదో కూడా చెప్పలేని అసమర్ధత.
రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో కూడా చెప్పలేని అసమర్థ మంత్రి సంబంధిత శాఖను గాలికి వదిలేసి, అవాకులు చెవాకులు పెలేందుకు మాత్రం ముందు వరుసలో ఉంటారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి మాట తప్పిన వైనం. సినిమా టికెట్లు సామాన్యులకు అందుబాటులో ఉండడం కోసమే రేట్లు తగ్గిస్తున్నామని చెప్పి తిరుమలలో గదులను సామాన్యులకు అందనంత దూరం చేసిన పొంతనలేనితనం.
ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తారీఖున నిరుద్యోగులకు వరంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి ఆ ఊసే ఎత్తని మడమ తిప్పేతనం. మద్యపానం నిషేధించడమే లక్ష్యంగా మద్యం రేట్లు పెంచుతున్నామని చెప్పి ఇప్పుడు ఆ మద్యమే ముఖ్య ఆదాయ వనరుగా మారింది అనేది జగమెరిగిన సత్యం. అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసి, కౌలు రైతులను, వారి ఆత్మహత్యలను పట్టించుకోని మోసపూరిత ప్రభుత్వం. రాయి, రప్పా, మన్ను, మిన్ను కాదేదీ దోపిడీకి అనర్హం. అభివృద్ధికి పాలసీలు చేయరు దోచుకునే దారుల కోసం పాలసీలు రూపొందించడం. మౌలిక సదుపాయాల కల్పన లేదు దారి తెన్ను లేదు అన్నట్లు రోడ్లన్నీ గుంతల మయం. ఆఖరికి చెత్త మీద కూడా పన్ను వసూలు చేస్తున్న చెత్త ప్రభుత్వం. విద్యుత్తు సంస్థల కు చెల్లించాల్సిన బకాయిలు టాప్ అప్ చార్జీల పేరిట, వసూలు చేస్తూ, విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచిన సామాన్యులకు భారం పెంచడం. నూతన విద్యా విధానం అంటూ పేదలకు అందుబాటులో ప్రభుత్వ పాఠశాలలు లేకుండా మూసి వేసి, విద్యార్థులను ఇబ్బంది పెట్టడం తప్ప చేసిన మంచి ఏముంది? ఫీజు రీ ఎంబర్స్మెంట్ లేదు, విదేశీ విద్యా స్కీముకి పేరు మార్చి ప్రచార ఆర్భాటమే కానీ నిధులు మంజూరు ఉండదు.
ప్రకృతి వనరులను సర్వ నాశనం కొండలు పిండి చేస్తూ, అడవులను నరికేస్తూ, మడ అడవులు ధ్వంసం కోర్టు చేత తిట్లు తినటం, రిషి కొండను తొలిచి విధ్వంసం కప్పి పుచ్చుకునేందుకు గ్రీన్ పరిచేంత అవివేకం పరిశ్రమలలో కాలుష్య నివారణలు చర్యలు లేవు, ప్రమాద నివారణ , పరిశ్రమల కు స్థితిగతులకు సమీక్షించుకునే ఆడిట్ లేదు. గ్రామ పంచాయతీల నిధులు, ఎస్సి, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు మళ్లించి నవరత్నాల పేరిట మోసం చేయటం. స్కూల్స్, ప్రభుత్వ భవనాలకు, జాతీయ జెండా, జాతిపిత విగ్రహాలకు పార్టీ రంగులు వేసి న్యాయస్థానం మొట్టికాయలు వేస్తే మార్చటం ప్రజాధనం దుర్వినియోగం తప్ప ఒరిగింది ఏమి లేదు. దిక్కు, దశ లేని దిశ చట్టం, కేంద్రం రెండుసార్లు తిప్పి పంపినా, ఆమోదం లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం దాన్నే చట్టంగా ప్రచారం.
మహిళపై అత్యాచారాలు, అఘాయిత్యాల కేసుల్లో ఏపీ మొదటి 10 స్థానాల్లో ఉన్నా నిమ్మకు నీరెత్తినట్లు మౌనంగా ఉన్న ప్రభుత్వం. “గన్ కంటే ముందు జగన్ వస్తాడని” ప్రగల్భాలు అత్యాచారాలపై ప్రశ్నిస్తే తల్లిదండ్రుల పెంపకం ప్రస్తావించే మహిళ మంత్రులు. రక్షణకలిపించని అధికారం, భాదితులకు న్యాయం చేయని చట్టం చేసి ప్రచారం తప్ప పైసా ఉపయోగం లేదు.
సొంత ఇంటి కల కన్న ప్రజలకు కడకండ్లు ఈ జగనన్న ఇళ్లు. స్థలం సేకరించటం, స్థలం కేటాయించటం, నిర్మాణానికి నిబంధనలు, నిర్మించాలని ఒత్తిడులు లోప భూయిష్ట విధానాలు వెరసి జనన్న ఇళ్లు పేదలకు కన్నీళ్లుగా మారిపోయింది. ఇక అప్పులు చేయటంలో కనిపించే అభివృది గ్రాఫ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం లో కనిపించదు. ఏడాదిలో చేయాల్సిన అప్పును ఆరు నెలల్లో చేసేసి. వచ్చే ఆరు నెలలు అదనపు అప్పుల కోసం కేంద్రాన్ని అడగటమో, ఆస్తులు అమ్మటమో తాకట్టు పెట్టటమో చేయాలి.
ఇదేమిటి అని ప్రశ్నిస్తే వ్యక్తిగత దూషణలు చేస్తారు తప్ప సరైన సమాధానం చెప్పలేని సమర్ధ ప్రభుత్వం, ప్రభుత్వం లో పదవులు అనుభవిస్తున్న మంత్రులు. చేసిన అభివృద్ధి ఉంటే చెప్పగలరు చేయని, అడ్రెస్ లేని పనిని చెప్పలేక ఈ పాట్లు, అధిష్టానం మెప్పుకోసం చేసే సర్కస్ ఫీట్లు. ఈ లాంటి దుస్థితిలోకి వెళ్లిపోయిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలి.