Logo
Date of Publish : 10 July 2023, 4:54 pm
Editor : Sake Naresh

ప్రభుత్వ విధానాలపై ప్రజలలో అసంతృప్తి : కందుల నాగరాజు

     విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమం 74వ రోజుకు చేరుకుంది. సోమవారం నియోజకవర్గంలోని 33వ వార్డులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి గడపగడపకు వెళ్లి ప్రజల నుంచి నేరుగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని హామీ ఇచ్చారు. అనంతరం 33 వ వార్డు, అమ్మవారివీధి లో పుష్పవతి అయిన అమ్మాయి జాహ్నవికి పట్టు బట్టలు, వెండి పట్టీలు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ పవనన్న ప్రజా బాట కార్యక్రమంలో ప్రజల పడుతున్న కష్టాలను నేరుగా తెలుసుకోవడం జరిగిందన్నారు. దక్షిణ నియోజకవర్గంలోని ప్రతి వార్డులో పర్యటించి నేరుగా ప్రజలను కలుసుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వ విధానాలపై ప్రజలలో అసంతృప్తి ఉందని చెప్పారు. ప్రభుత్వ మార్పు ప్రజలు కోరుతున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని అందరూ భావిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే కచ్చితంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని డాక్టర్ కందుల చెప్పారు. ప్రజల మంచి కోసం ఏం చేయడానికి అయినా సరే తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. పవనన్నా ప్రజా బాట కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నారాయణ రెడ్డి, మని , రాజేశ్వరి, జాన్సీ, దుర్గ, కుమారి , జనసేన యువనాయకులు కందుల కేదార్నాథ్ , కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com