ఆచంట ( జనస్వరం ) : దళిత బిడ్డలను అకారణంగా వాలంటరీ విధుల నుండి తొలగించారని దానికి గల కారణాలను తెలపాలని కోరుతూ దళిత నాయకులు, కొంత మంది వాలంటీర్ లు, లబ్ధి దారులతో కలిసి వాలంటీర్ లు రావి హెప్సిబా, పిల్లి సునీల్ స్థానిక ఎంపిడివో కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీఓ డి.సుహాసిని కలిసి తమకు జరిగిన అన్యాయం గురించి వివరించి తొలగించడానికి గల కారణాలు తమకి తెలిపాలని వారు కోరారు. ఎంపిడివో సానుకూలంగా స్పందించి రెండు రోజుల లో పూర్తి వివరాలతో మీకు అందజేస్తామనీ ఆమె తెలిపారు. అనంతరం దళిత ఉద్యమ నాయకుడు ఉన్నమట్ల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ రాజకీయ నాయకుల కక్షలతో రెండు నెలల చిన్న పిల్లాడిని కలిగి ఉన్న రావి హెప్సిబా ను కారణం ఏమి చెప్పకుండా తొలగించడం అన్యాయం అని, వారి పట్ల ఇలాంటి చర్యలకు పాల్పడే నాయకుల పట్ల చర్య తీసుకోవాలని అని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. విధుల నుండి తొలగించిన వారికి వెంటనే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు దళిత నాయకులు రావి హరీష్ బాబు, పిల్లి చంద్రమోహన్, కలిగితి నరసింహ మూర్తి, పిల్లి అసాపు తదితరులు పాల్గొన్నారు.