Logo
Date of Publish : 22 September 2020, 7:02 am
Editor : Sake Naresh

మంత్రి కొడాలి నాని పదవికి అనర్హుడు బర్తరఫ్ చేయండి : జనసేన నాయకుడు సి. కృష్ణయ్య

మంత్రి కొడాలి నాని పదవికి అనర్హుడు బర్తరఫ్ చేయండి : జనసేన నాయకుడు సి. కృష్ణయ్య

            మంత్రి కొడాలి నాని పదవికి అనర్హుడు "బర్తరఫ్" చేయాలని తిరుపతి జనసేన నాయకుడు సి. కృష్ణయ్య గారు డిమాండ్ చేశారు.  హిందూ సనాతన ధర్మాన్ని కాపాడండి హిందువుల మనోభావాలను గౌరవించండి. 
1) తిరుమల శ్రీవారి సాంప్రదాయాల గురించి "డిక్లరేషన్" పూర్వాపరాలను గురించి కొడాలి నాని తెలుసుకోవాలంటే ఏపీ సీఎం గారి సలహాదారులు "టిటిడి మాజీ ఈ ఓ అజయ్ కల్లం" గారిని అడిగి తెలుసుకొని మాట్లాడండి!!
2) కొడాలి నాని వ్యాఖ్యలపై స్వరూపానంద స్వామి, చిన్న జీయర్ స్వామి, పరిపూర్ణానంద స్వామి ఇతర మఠాధిపతులు పీఠాధిపతులు ఎందుకు మౌనంగా ఉన్నారు!
3) "హిందూ ధర్మం పై దాడి" జరుగుతుంటే మఠాధిపతులు పీఠాధిపతులు "దాగుడు మూతలు" ఆడుతున్నారా??
4) కొడాలి నాని లాంటి వ్యక్తి అహంకార పూరిత మాటల కారణంగా ఏపీ సీఎం కు హిందువులలో అప్రతిష్ట ఏర్పడుతుంది!!
5) కొడాలి నానికి ప్రతిపక్ష పార్టీ నాయకునికి రాజకీయ వైరం ఉంటే మీరు మీరు తేల్చుకోండి అంతే తప్ప హిందూ సంప్రదాయాలను కించపరచకండి వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురి కాకండి హిందువుల సహనాన్ని చేతగానితనంగా చూడకండి!
6)విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో రధానికి ఉన్న వెండి సింహం విగ్రహాల మాయం,అంతర్వేదిలో రథం ఆహుతి, ఆంజనేయస్వామి విగ్రహం చేయి విరగటం లాంటి సంఘటనలు రాష్ట్రంలో పునరావృతం కాకుండా బాధ్యతగా ఏపీ సీఎం సీబీఐ దర్యాప్తు కి ఆదేశిస్తే మంత్రి కొడాలి నాని మాత్రం అవహేళనగా మాట్లాడటం రథం కాలితే ఏమైంది,వెండి విగ్రహాలు పోతే పోయింది, ఆంజనేయస్వామి బొమ్మ చేయి విరిగితే ఏమౌతుంది అనడం మంత్రి అహంకారానికి నిదర్శనం!!
7) ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి కుటుంబ సభ్యులుగా ఉన్న అన్నీ మతాల మధ్య కొడాలి నాని వ్యాఖ్యలు చిచ్చుపెట్టేలా ఉన్నాయి!!
8) కొడాలి నాని చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలను ఉపసంహరించుకుని "హిందువులకు బేషరతుగా క్షమాపణలు" చెప్పాలి!!  అని తిరుపతి విశ్రాంతి పోలీస్ అధికారి, జనసేన నాయకుడు సి. కృష్ణయ్య గారు కోరారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com