అనంతపురం, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు రాష్టంలో దాదాపు 8 తుఫాన్లు వచ్చాయి. తుఫాన్ల వల్ల నష్టపోయిన ప్రజలు, రైతులను ఆదుకోవడంలో అప్పటి టిడిపి ప్రస్తుత వైసిపి ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజల దృష్టి మరల్చేందుకే అసెంబ్లీలో జుగుప్సాకర వ్యాఖ్యలు చేశారని జనసేన జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ జయరామిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకవైపు రాష్ట్రంలో గంజాయిని పెద్ద ఎత్తున పండించి విక్రయించి రాజకీయనాయకులు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. మహిళల పట్ల ఎవరు తప్పుగా మాట్లాడిన జనసేన ఖండి స్తుందన్నారు. అయితే అధికార ప్రతిపక్షాలు 60శాతం, 40శాతం వాటాలు పంచుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను మభ్యపెడుతూ మీ కుల పార్టీలు అధికారంలో తెచ్చుకోవడానికి ప్రజలను అన్యాయానికి గురి చేస్తున్నారన్నారు. ప్రజాసమస్యలను గాలికి వదిలేసి దొంగనాటకాలు ఆడితే మూల్యం చెల్లించుకోక తప్పదని జయరామిరెడ్డి హెచ్చరించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని 2024లో టిడిపి వైసిపికి గుణపాఠం చెబుతారన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com