ఉదయగిరి ( జనస్వరం ) : నియోజకవర్గం నాయకులు బోగినేని కాశీరావు గారు మరియు జిల్లా కార్యదర్శి ఆల్లూరి రవీంద్ర, ఉదయగిరి మండల అధ్యక్షులు సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయం ఇంకా 3 నెలలు మాత్రమే ఉన్నందున మండలంలో పార్టీ కార్యచరణ, ఉమ్మడి మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ బలోపేతం గురించి చార్ ఎన్నికలకు ఏ విధంగా సన్నద్ధం అవ్వాలి అను పల అంశాల గురించి ఉదయగిరి మండల ముఖ్య నాయకులతో ఉదయగిరి పట్టణంలోని నియోజకవర్గ కార్యలయంలో చర్చించడం జరిగింది. MLA టికెట్ ఎవరికీ ఇచ్చినా కానీ టిడిపి, జనసేన ఉమ్మడి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు బోగినేని కాశీరావు, జిల్లా కార్యదర్శి ఆల్లూరి రవీంద్ర, మండల అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి మండల నాయకులు పసుపులేటి తిరుపతయ్య, చింతల శ్రీను, ఆంజనేయులు, చంద్రబాబు, నెమళ్ళదిన్నె సర్పంచ్ తోకల రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com