Logo
Date of Publish : 27 September 2023, 7:11 pm
Editor : Sake Naresh

సుప్రీంకోర్టులో చంద్రబాబుకు నిరాశ..

` విచారణను అక్టోబర్‌ 3కు వాయిదా వేసిన ధర్మాసనం
` చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ ను విచారించిన సుప్రీంకోర్టు
` బాబు తరపున వాదనలు వినిపించిన లూథ్రా
` రేపటి నుంచి అక్టోబర్‌ 2 వరకు సుప్రీంకోర్టులు సెలవులు
       ఢిల్లీ ( జనస్వరం ) : స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురయింది. ఆయన వేసిన క్వాష్‌ పిటిషన్‌ ను సుప్రీంకోర్టు అక్టోబర్‌ 3వ తేదీకి వాయిదా వేసింది. రేపటి నుంచి అక్టోబర్‌ 2వ తేదీ వరకు సుప్రీంకోర్టుకు సెలవులు ఉండటంతో ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు తరపున సిద్ధార్థ్‌ లూథ్రా వాదననలు వినిపించారు. ఈ పిటిషన్‌ విచారణ నుంచి జస్టిన్‌ ఎస్వీ భట్టీ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆయన నాట్‌ బిఫోర్‌ మీ తీసుకున్నారు. దీంతో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ ను సీజేఐ ముందు సిద్ధార్థ్‌ లూథ్రా మళ్లీ మెన్షన్‌ చేశారు. పిటిషన్‌ ను తక్షణమే లిస్టింగ్‌ చేయాలని సీజేఐని కోరారు. త్వరగా లిస్ట్‌ చేయాలనేది తమ మొదటి అభ్యర్థన అని, చంద్రబాబుకు మధ్యంతరం ఉపశమనం కలిగించాలనేది రెండో అభ్యర్థన అని లూథ్రా విన్నవించారు. 17ఏ అనేది కేసు మూలాల నుంచి చర్చించాల్సిన అంశమని లూథ్రా చెప్పారు. చంద్రబాబుకు బెయిల్‌ ఇవ్వాలని తాము కోరుకోవడం లేదని అన్నారు. పోలీసు కస్టడీ నుంచి మినహాయింపు కోరుతున్నామని చెప్పారు. జెడ్‌ కేటగిరీ, ఎన్‌ఎస్జీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని ఇలా ఎలా ట్రీట్‌ చేస్తారని ప్రశ్నించారు. ఇది వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన విషయమని చెప్పారు. యశ్వంత్‌ సిన్హా కేసులో వ్యక్తి స్వేచ్ఛపై అన్ని విషయాలను పొందుపరిచారని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com