` విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసిన ధర్మాసనం
` చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు
` బాబు తరపున వాదనలు వినిపించిన లూథ్రా
` రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టులు సెలవులు
ఢిల్లీ ( జనస్వరం ) : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురయింది. ఆయన వేసిన క్వాష్ పిటిషన్ ను సుప్రీంకోర్టు అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. రేపటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సుప్రీంకోర్టుకు సెలవులు ఉండటంతో ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా వాదననలు వినిపించారు. ఈ పిటిషన్ విచారణ నుంచి జస్టిన్ ఎస్వీ భట్టీ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆయన నాట్ బిఫోర్ మీ తీసుకున్నారు. దీంతో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను సీజేఐ ముందు సిద్ధార్థ్ లూథ్రా మళ్లీ మెన్షన్ చేశారు. పిటిషన్ ను తక్షణమే లిస్టింగ్ చేయాలని సీజేఐని కోరారు. త్వరగా లిస్ట్ చేయాలనేది తమ మొదటి అభ్యర్థన అని, చంద్రబాబుకు మధ్యంతరం ఉపశమనం కలిగించాలనేది రెండో అభ్యర్థన అని లూథ్రా విన్నవించారు. 17ఏ అనేది కేసు మూలాల నుంచి చర్చించాల్సిన అంశమని లూథ్రా చెప్పారు. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని తాము కోరుకోవడం లేదని అన్నారు. పోలీసు కస్టడీ నుంచి మినహాయింపు కోరుతున్నామని చెప్పారు. జెడ్ కేటగిరీ, ఎన్‌ఎస్జీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని ఇలా ఎలా ట్రీట్ చేస్తారని ప్రశ్నించారు. ఇది వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన విషయమని చెప్పారు. యశ్వంత్ సిన్హా కేసులో వ్యక్తి స్వేచ్ఛపై అన్ని విషయాలను పొందుపరిచారని తెలిపారు.