రాజంపేట ( జనస్వరం ) : ఐసిడిఎస్ కార్యాలయం వద్ద 11 రోజులుగా తమ డిమాండ్లను పరిష్కరించాలని సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ వారికి సంఘీభావం ప్రకటించి శుక్రవారం మధ్యాహ్నంవిందు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా మలిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ, అంగన్వాడీలకు తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే జనసేన పార్టీ ఎప్పుడు అంగన్వాడి కార్యకర్తలకు అండగా ఉంటుందన్నారు.పది రోజుల నుండి అంగన్వాడి వర్కర్లు సమ్మె నిర్వహిస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. అంగన్వాడీలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మొన్న జరిగిన బహిరంగ సభలో టిడిపి జనసేన పార్టీ 2024 లో ఉమ్మడిగా ప్రభుత్వం చేపడుతుందని చేపట్టిన వెంటనే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పడం జరిగిందన్నారు. రాబోవు 2024 ఎన్నికలలో ప్రజలందరూ జనసేన టిడిపి పార్టీల ఉమ్మడి అభ్యర్థులను గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య,సుంకేసుల చౌడయ్య, కొత్తూరు వీరయ్య ఆచారి,అబ్బిగారి గోపాల్, గోవర్ధన్ ఆచారి, జనసేన వీర మహిళ పోలిశెట్టి రజిత, జడ్డా శిరీష తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com