Logo
Date of Publish : 21 February 2022, 8:29 am
Editor : Sake Naresh

ఇరగాయి గ్రామంలో శిథిలావస్థలో ప్రభుత్వ పాఠశాలభవనం

   అరకు, (జనస్వరం) : విశాఖపట్నం జిల్లా అరకు వేలి మండలం మారుమూల ఇరగాయి పంచాయితీ ఇరగాయి గ్రామంలో మాదల శ్రీరాములు, అల్లంగి రామకృష్ణ, బిమిడి మత్యరాజు  ఇరగాయి గ్రామ పంచాయితీలో పర్యటించడం జరిగింది. ఆ గ్రామస్తులతో సమావేశమైన అనంతరం పాఠశాలలో విద్యార్థులతో కలిసి పాఠశాల భవనాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులు పాఠశాలలో కూర్చుని చుదువుకోవడానికి సరైన స్థలం కూడలేదని వర్షాకాలంలో అయితే పూర్తిగా సెలవు ప్రకటించవలిసిందేనని విద్యార్థులు, వారి తల్లి తండ్రులు తెలిపారు. పంచాయితీలొనే పాఠశాల భవనం ఇలా ఉందంటే మారుమూల గ్రామాల్లో పాఠశాల భవనాలు ఎలా ఉన్నాయో ఈ పాఠశాల చూస్తే తెలుస్తుందని అన్నారు. పిల్లలను బడికి పంపాలంటేనే భయమేస్తోంది అని తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ సందర్భముగా మాదాల శ్రీరాములు మాట్లాడుతూ ఇరగాయి గ్రామంలో ఎప్పుడో నిర్మించిన పాఠశాల భవనం ఇప్పుడు పడిపోయే ప్రమాదంలో ఉంది. పిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నారు. పాఠశాల భవనం పడితే మా పిల్లల పరిస్థితి ఎవరికి చెప్పాలి అంటు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాడు నేడు కింద పాఠశాల భవనం మంజూరు చేయాలని జనసేనపార్టీ తరుపున పిల్లలు, తల్లిదండ్రులుతో కలిసి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సుకురు అప్పలరాజు, మధు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com