Logo
Date of Publish : 07 October 2021, 3:46 pm
Editor : Sake Naresh

కన్నబాబు మీకు ఎమ్మెల్యేగా భిక్ష పెట్టింది పవన్ కళ్యాణ్ అని మరిచావా ?? : పిఠాపురం జనసేన ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి

            పిఠాపురం ( జనస్వరం ) : మాకినీడి శేషు కుమారి మాట్లాడుతూ పవన్ అంటే ఒక బ్రాండ్... పవన్ అంటే ఒక ప్రభంజనం... పవన్ అంటే ఒక వ్యసనం. ఇది ఆంధ్రా ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అభిమానం. అలాంటి వ్యక్తిపై కొన్ని రోజులుగా అధికార పార్టీ నాయకులు, మంత్రులు బురద జల్లుతున్న అంశం మీద మాకినీడి శేషుకుమారి  ఖండించారు. రాజమండ్రిలో జరిగిన శ్రమదానం కార్యక్రమం విజయవంతం అయింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాదరణ చూసిన అధికార నేతలు భయందోళన చెంది ఏమాట్లాడుతున్నారో తెలియడం లేదని, పవన్ కల్యాణ్ కుల రాజకీయాలు చేస్తున్నారు అన్న వ్యాఖ్యపై మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడటం హాస్యాస్పదం. కాకినాడ రూరల్ లో కాపు ఓటింగ్ కు ఆశపడి కుల కుంపటితో నెగ్గిన కన్నబాబు పవన్ కళ్యాణ్ ని విమర్శించే  స్దాయి కాదని హెచ్చరించారు. వెల్లంపల్లి మాట్లాడే ముందు 2019 ఎలక్షన్ ముందు పవన్ కల్యాణ్ వారి దగ్గర టిక్కెట్ కోసం చేతులు నలుపుకుంటూ తిరిగిన తీరును మర్చిపోకూడదని ఆరోజు మా అధినేతను కాకా పట్టి, ఈ రోజు అధికార పంచనచేరి కాకమ్మ కబుర్లు చెప్పడం తగదన్నారు. 2024 సంత్సరంలో జరిగే ఎన్నికల్లో ఏ పార్టిలో ఉంటాడో తెలియని వెలంపల్లి ఈవిధంగా మాట్లాడం విడ్డూరంగా ఉందన్నారు.  పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారు రెండుచోట్ల ఓడిపోయారు అంటున్నారు పెండం దొరబాబు ఓటమి తెలియకుండానే ఉన్నారా ? ఇదే నాజీవితం ఇదే నా చివరి అవకాశం ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని ప్రజలు కాళ్ళు పట్టుకున్న రోజులు మర్చిపోయారని అన్నారు. పిఠాపురం అభివృద్ధి చేయడం చేత కాలేదు గాని విమర్శలు చేతనవుతున్నాయని అడిగేవారు లేరు కదా అని ఇష్టం వచ్చినట్లుగా విమర్శలకు దిగితే జనసైనికుల తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com