విజయవాడ, (జనస్వరం) : పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టిడ్కో ఇళ్ళ కోసం నగరంలో అనేకమంది మహిళలు అప్పులు చేసి పాతికవేల నుంచి లక్ష రూపాయల వరకు గత ప్రభుత్వంలో చెల్లిస్తే వారికి మీరు వచ్చి ఇల్లు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు గురిచేస్తున్నారని గతంలో జక్కంపూడి లో కట్టినటువంటి ఇల్లును ఏం చేయాలని మీరు అనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ ఇల్లు అన్ని మీ వైసీపీ కార్యకర్తలకు ఇవ్వాలనుకుంటున్నారా..?? అని ఎద్దేవా చేశారు. వైసీపీ అధికారంలోకి రాకముందు ప్రజలకు అనేక వాగ్దానాలు చేసి ఉన్నారని ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చేందుకు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. అధికారంలోకి రాగానే కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా తీసుకువస్తానని చెప్పిన సీఎం జగన్.. అధికారంలోకి వచ్చాక కేంద్రం వద్ద మోకరిల్లి ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తున్నారని అన్నారు. అలాగే సంపూర్ణ మద్యపానం నిషేధిస్తామన్నారు. మద్యం నిషేధించకపోగా సొంత బ్రాండ్లతో మద్యాన్ని ఏరులై పారిచి సామాన్య మధ్యతరగతి కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో అవినీతి బట్టబయలు చేసి వెలంపల్లి శ్రీనివాస్ ను మంత్రి పదవి తొలగించేలా చేసిన ఘనత పోతిన మహేష్ దేనని ఆయన అన్నారు. మహేష్ ఎదుగుదలను చూసి ఓర్వలేక పనికిమాలిన నలుగురు వ్యక్తులను కోవర్ట్ లు చేసి పార్టీలో చిలకలు తేవాలని చూస్తున్నరని వారికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. వేల్లంపల్లి శ్రీనివాస్ విలువలు గురించి మాట్లాడితే హాస్యాస్పదంగా ఉందని, నోటికి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని, మీకు తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
అనంతరం నమన్ కార్తీక్ మాట్లాడుతూ మంత్రిగా మూడు సంవత్సరాలు చేసిన వెలంపల్లి శ్రీనివాస్ వాళ్ళ ఇంటిదగ్గర రోడ్డు వేయించుకోవడానికి నాలుగు రోజులు పట్టింది కానీ నియోజకవర్గంలో గుంటలు పడిన రోడ్లు పూడ్చి కొత్త రోడ్లు వేయలేకపోయారన్నారు. కొండ ప్రాంతంలో మెట్లు పాడైపోతే నేటికీ కొత్త మెట్లు కట్టలేకపోయారన్నారు. యువతకి ఉపాధి అవకాశాలు కూడా కల్పించలేకపోయారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో విజయవాడ నగర ఉపాధ్యక్షులు సోమనాథం, సంయుక్త కార్యదర్శి గనీ రాము, జనసేన నాయకులు బైపు రామకృష్ణ, ములకల హనుమాన్ తదితరులు పాల్గొన్నారు.