Logo
Date of Publish : 15 December 2020, 2:01 pm
Editor : Sake Naresh

ఏలూరు నగర సమస్యల పరిష్కారానికై జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

ఏలూరు నగర సమస్యల పరిష్కారానికై జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

                ఏలూరు పట్టణంలో స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం పెంచుతున్న ఆస్తిపన్నుల గురించి, పట్టణంలో మౌలిక సదుపాయాలైన రోడ్లు డ్రైనేజీల నిర్మాణం, మెయింటెనెన్స్ విషయాలపై మరియు మంచినీటి సరఫరా విషయంలో తలెత్తుతున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జనసేన పార్టీ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పోరేషన్లలో మరియు మున్సిపాలిటీలలో పురపాలక చట్టం ఆస్తిపన్ను సవరణ బిల్లు 2020 ద్వారా, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఆస్తి పన్నులను - రిజిస్ట్రేషన్ విలువ ప్రకారంగా ఇంటి పన్ను నిర్ధారణ చేసే చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాము. ఈవిధానంలో పన్నులు వేయడం ప్రజలపై పెనుభారాన్ని మోపినట్లేననీ, ఇది పూర్తి అసంబద్ధమైన జి.ఓ. అనీ, వార్షిక అద్దె విలువ ఆధారిత పన్ను నుండి ఈ విధమైన పన్ను విధానంలోకి మార్చడం వల్ల దాదాపుగా 30 రెట్లు అధికంగా ప్రజలపై భారం పడే అవకాశం ఉంది. కనుక దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని జనసేనపార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోందని రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. అంతేకాక గత 9 నెలలుగా కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి జీవనం సాగించలేని పరిస్థితిలో ప్రజలు ఉన్న సమయంలో ఈ యొక్క పన్నుల పెంపు నిర్ణయం ప్రజలపై పెనుభారంగా మారుతుంది. కావున అధికారులు ప్రభుత్వం ప్రజల యొక్క బాధను అర్ధంచేసుకొని పాత పన్నుల విధానాన్ని కొనసాగించాలని కొత్తగా తయారు చేసిన చట్టాన్ని ఉపసంహరించు కోవాలని, లేకుంటే ప్రజోపయోగల కోసం ఉద్యమాన్ని చేపట్టడం జరుగుతుందని జనసేనపార్టీ హెచ్చరిస్తోంది.

              అంతేకాక ఏలూరు మున్సిపల్ కార్పోరేషన్ లో దాదాపు 60, 70 సంవత్సరాల నుంచి ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీల పూడిక తీసి నూతన నిర్మాణం చేయాలనీ, పట్టణ తాగునీటి అవసరాల కోసం కృష్ణ, గోదావరి కాలువల నుండి తాగునీటి జలాలని నిలువ చేసే పంపుల చెరువును శుద్ధి చేసి, దానిలో వ్యర్ధపదార్ధాలు పడనివ్వకుండా చెరువు చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేయాలనీ కోరారు. అలాగే దానికి సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేసి, ఏలూరు నగర ప్రజలకు కృష్ణా, గోదావరి నీటిని పరిశుభ్రం చేసి అందించి, ప్రజలు వ్యాధుల బారిన పడకుండా రక్షించాలని ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే  ఏలూరు నగరంలోని కుళాయి పంపుల కనెక్షన్లు , డ్రైనేజిలలో నుంచి కాకుండా పక్కనుంచి పైప్ లైన్ వేసి అలాగే కుళాయికి రక్షణగా కుండీలు నిర్మాణం చేయాలి. అలాగే ఓవర్ హెడ్ ట్యాంకులు టైం ప్రకారంగా క్లీనింగ్ చేసి మోతాదు ప్రకారంగా బ్లీచింగ్, క్లోరిన్ వంటి శాస్త్రీయమైన వాటితో శుద్ధి చేసి మంచి నీటిని సరఫరా చేయవలిసిందిగా ఏలూరు నగర కార్పొరేషన్ కమిషనర్ ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రాన్ని అందించడం జరిగిందని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు తెలియచేశారు.

           ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కాశీ నరేష్, మండల అధ్యక్షుడు వీరంకి పండు, నగర ఉపాధ్యక్షులు బొత్స మధు, శ్రావణ్ కుమార్, నగర ప్రధాన కార్యదర్శి రాజేష్ ధర్మేంద్ర సుందరనీడు ప్రసాద్, నవీన్, పైడి లక్ష్మణరావు, అల్లు చరణ్, సాగర్, ఎమ్మార్వో నాగేశ్వరావు, లోవరాజు, భాస్కర్, రాము, రవి, గిరిజ కుమారి, హిమబిందు, చిరంజీవి, రాజు, అశోక్, మహేష్, ఆంజనేయులు, రాము, రమేష్, సన్యాసినాయుడు, సాయి, శ్రీను, విజయ్, అభిషేక్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com