రాజంపేట ( జనస్వరం ) : పెనగలూరు మండలంలోని ఇండ్లూరు గ్రామంలో రోడ్లు వెంబడి జనసేన పార్టీకి సంబంధించిన మేము సిద్ధమే అన్న బ్యానర్ లను ఏర్పాటు చేయడం జరిగినది. వ్యక్తిగతంగా ఒకరు పదేపదే ఫ్లెక్సీలను చించడం జరిగిందని జనసేన నాయకులు అన్నారు. ఆ వ్యక్తిపై కేసు నమోదు చేయాలని జనసైనికులు పెనగలూరు మండలం ఎస్సై సుభాష్ చంద్రబోస్ కి మొదటిసారి ఫిర్యాదు ఇవ్వడం జరిగినది. చించిన వ్యక్తి తెలిసినా కూడా అతనిపై కేసు నమోదు చేయలేదని సమాచారం తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, మరో రాష్ట్ర కార్యదర్శి ముక్రం చాంద్ రాయలసీమ జోన్1కన్వీనర్ జోగినేని మణి, జనసేన పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ కుపాల జ్యోతి, జనసేన కార్యకర్తలు, టిడిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున మండల పరిధిలోని పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడుతూ ఒకటి కాదు రెండు కాదు మూడు దఫాలుగా ఫ్లెక్సీలను చించుతున్న వ్యక్తిపె తెలిసి కూడా కేసు ఎందుకు నమోదు చేయలేదని ఎస్ఐ సుభాష్ చంద్రబోస్ ని వివరణ కోరుతూ మేమే వైసిపి నాయకులు వలె భూ కబ్జాలు మర్డర్లు ఇసుక మాఫియా వంటి కార్యక్రమాలు ఏమి చేయలేదని అన్నారు. మా సొంత డబ్బుతో కష్టార్జితంతో మా నాయకుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో జనంలో చైతన్యం నింపుటకు మేము సిద్ధమే అన్న బ్యానర్ లను ఏర్పాటు చేసుకున్నాము అని అన్నారు. ఇటువంటి దశ్చర్యాలకు పాల్పడే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ వారికి చెప్పడం జరిగినది. ఎస్ఐ సుభాష్ చంద్రబోస్ ను వివరణ అడగగా సోమవారం నాడు ఫ్లెక్సీ చిచ్చిన వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని తెలపారు. ఈ కార్యక్రమంలో మాదాసు నరసింహ, పగడాల వెంకటేష్, వీరు రాయల్, నవీన్, కంచర్ల సుధీర్ రెడ్డి, ఆనందల తేజ, కొనిశెట్టి చక్రి, ప్రకాష్, సాయి,కొత్తపల్లి కళా చంద్ర, కోళ్ల మురళి, కొత్త బాల, జనసేన యువ నాయకుడు గొబ్బూరి హరి, నాగినేని రాంప్రసాద్ నాయుడు, పసుపులేటి ప్రసాద్, షామీర్ భాష, జిలకర నాగేంద్ర, జనసేన, టిడిపి ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగినది.