Logo
Date of Publish : 27 May 2023, 5:46 pm
Editor : Sake Naresh

అక్రమ ఇసుక తవ్వకాలను ఆపాలని జనసేన నాయకుల ధర్నా

     వేమూరు ( జనస్వరం ) : కొల్లూరు మండలం, కొల్లూరు కరకట్ట పైన ఇసుక అక్రమ తవ్వకాలు నిలిపివేయాలని జనసేన పార్టీ అధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సోమారౌతు అను రాధ మాట్లాడుతూ నెల రోజులుగా అధికారులకి వినతి పత్రాలు ఇస్తున్నా పట్టించుకోక పోవటంతో ప్రజల పక్షాన ధర్నా కార్యక్రమం నిర్వహించామని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి అక్రమ ఇసుక తవ్వాకాలని నియంత్రించాలి లేకుంటే తమ ధర్నా కొనసాగుతుంది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జేపీ వెంచర్ కి ఇచ్చిన లీజూ గడువు ముగిసిన ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నారని, ఎవరి ప్రోద్బలం తో జరుగుతుందో ప్రజలకి తెలియాలని కోరుతున్నామని అన్నారు. కొల్లూరు మండల జనసేన అధ్యక్షుల బొందలపాటి చలమయ్య మాట్లాడుతూ కోర్టు సైతం జేపీ పవర్ వెంచర్ ని ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చి 18 కోట్లు రూపాయలు జరిమానా కూడా విధించింది.  ఐనా ఈ ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయని అధికారులు తక్షణం స్పందించి తగు చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com