చిరు వ్యాపారులకు అండగా గొడుగులు అందించిన విశాఖ పశ్చిమ నియోజకవర్గ యువ నాయకుడు ధర్మేంద్ర
జనసేన జెండా ఎల్లప్పుడూ అందరికీ తోడు నీడగా ఉంటుంది అని విశాఖ పశ్చిమ నియోజకవర్గ యువ నాయకుడు ధర్మేంద్ర తెలియజేస్తూ, తన పుట్టిన రోజు సందర్భంగా 58, 60, 61 & 62 వార్డులో గల రోడ్డు మీద కాయగూరల దుకాణం వాళ్ళకి మరియు చెప్పులు కుట్టుకొనే చిరు వ్యాపారులకు జనసేన గొడుగులు ఇవ్వడం జరిగింది. ధర్మేంద్ర మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని, ప్రజలకు జనసేన సిద్దాంతాలను, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళేందుకు కష్టపడుతున్నామన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన 58వ వార్డు అభ్యర్థి అంగ ప్రశాంతి గారు, మొజ్జాడ చంద్ర మౌళి గారు, ములకపల్లి ప్రకాష్ గారు, నొట్ల రామచంద్ర కళ గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com