Logo
Date of Publish : 05 July 2021, 4:40 pm
Editor : Sake Naresh

కార్యకర్త కుటుంబానికి ధర్మవరం జనసేన ఇంచార్జ్ చిలకం మధుసూధన్ రెడ్డి ఆర్థిక సహాయం

        జనసేన పార్టీ ఓ కుటుంబం లాంటిది. అందులో ఏ ఒకరికి కష్టం వచ్చినా మిగిలిన కుటుంబ సభ్యులు అండగా నిలుస్తారని ధర్మవరం జనసేన ఇంచార్జ్, రాష్ట్ర రాజకీయాల వ్యవహారాల కమిటీ సభ్యులు చిలకం మధుసూదన్‌. రెడ్డి పేర్కొన్నారు. పుట్టపర్తి నియోజకవర్గం, అమడగూరు మండలం కందుకూరు పల్లి గ్రామానికి చెందిన ముద్దంగల వెంకటస్వామి, రంగమ్మ కుమారుడు జౌకల కొత్తపల్లి పంచాయతీ జనసేన పార్టీ సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీ చేసినా ముద్దంగల వెంకట రమణ (44) కరోనా సమయంలో తన 2 కిడ్నీలు ఫెయిల్‌ అవ్వడంతో మృతి చెందాడు. ఈ విషయం తెలియగానే జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు చిలకం మధుసూదన్‌ రెడ్డి పుట్టపర్తి, అమడగూరు.. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వయంగా వారి ఇంటికి వెళ్లి మృతి చెందిన రమణ భార్యశారద వారి పిల్లలను తల్లిదండ్రులను పరామర్శించారు. వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా రూ 85 వేల రూపాయలను ఆర్థిక సహాయం చేసి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా. చిలకం మధుసూదన్‌ రెడ్డి మాట్లాడుతూ వెంకటరమణ కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందన్నారు. తమ. అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రతి కార్యకర్తను క్జుటుంబ సభ్యులుగా భావిస్తారని... ఆయన బాటలోనే తాము కూడా పయనించి, ప్రతి కార్యకర్తకు అండగా. నిలుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అడ్డగిరి శ్యామ్‌ కుమార్‌, రామాంజనేయులు , బెస్త శ్రీనివాసులు, పూల శివ ప్రసాద్‌, అబ్బుల్‌ అబూ డాక్టర్‌ తిరుపథెంద్రా, ముత్యాల కరుణాకర్‌, ఈశ్వర్‌, శంకర్‌, నిజాం, గణేశ్‌, జగదీష్‌, అంజి,
చలపతి, ప్రవీణ్‌,న్రీనివాసులు, ఉతప్ప, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com