ధర్మవరం ( జనస్వరం ) : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి సమక్షంలో గతంలో బీఎస్పీ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు, ప్రముఖ దళిత నాయకుడు మేకల బాలకృష్ణ బీఎస్పీ పార్టీకి రాజీనామా చేశారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఆయనతో పాటు పలు కుటుంబాలు జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి ర్యాలీగా వస్తున్న క్రమంలో అధికార పార్టీ ప్రోత్బలంతో ర్యాలీగా వెళ్ళనివ్వకుండా, డ్రమ్స్ కొట్టనివ్వకుండా దళితున్ని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఈ విషయంపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ దళిత బిడ్డ మేకల బాలకృష్ణ ను అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి డ్రమ్స్ తో వస్తూ ఉంటే ఈ వైసీపీ పార్టీ వాళ్లు పోలీసులతో అడ్డుకోవడం హేయమైన చర్యని ఈ పరిపాలనలో దౌర్జన్యాలు, రౌడీ ఇజాలు, దోపిడీలతో ఏ ఒక్కరికి స్వేచ్చలేదని అలాగే ప్రజా కార్యక్రమాలు వదిలేసి ప్రతిపక్షాలు చేస్తున్న కార్యక్రమాల మీద దృష్టి పెట్టి వారికి ఆటంకాలు కలిగిస్తున్నారని ఎల్లకాలం వీళ్లే అధికారంలో ఉండరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com