భక్తులు ప్రసాదం కూడా నోచుకోవట్లేదు
- సీఎం జగన్ రెడ్డి దంపతులు తో కలిసి తిరుమల శ్రీవారికి, బెజవాడ కనకదుర్గమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించారని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.
- మతాల మధ్య చిచ్చు పెట్టాలని మంత్రి వెల్లంపల్లి కుట్ర చేశారు. అందుకే మూడు రోజుల నుంచి స్పందించడం లేదు.
- రాజకీయ లబ్ధి కోసమే ఈ కుట్ర.
- మంత్రి వెల్లంపల్లి కి రాజకీయ సమాధి కట్టండి.
- అన్యమత ప్రచారం పై మల్లాది విష్ణు ఎందుకు స్పందించలేదు
- జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ ప్రశ్నల వర్షం
విజయవాడ, (జనస్వరం) : అమ్మవారి భక్తులు పులిహార ప్రసాదానికి కూడా నోచుకోకపోవడం దురదృష్టకరమని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కలియుగదైవం వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ముఖ్యమంత్రి సతీసమేతంగా ఈ ఏడాది అయినా వెళ్తే బాగుంటుందని అన్న వదినలను కళ్ళారా చూసుకోవాలని రాష్ట్ర ప్రజల ఆరాటపడుతున్నారని అన్నారు. కనకదుర్గమ్మ ఆలయాన్ని కూడా సీఎం జగనన్న దంపతులతో వచ్చి పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామన్నారు. హిందువుల ఆచార వ్యవహారాల ప్రకారం ఒక్కొక్కరుగా వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించకూడదని, కావాలంటే మీ ఆస్థాన స్వామిజి స్వరూపానంద సరస్వతిని సంప్రదించాలన్నారు. దసరా ఉత్సవాల మొదటి రోజున అన్యమత ప్రచారానికి బాధ్యత వహిస్తూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రాజీనామా చేయాలన్నారు. ఈ ఘటన వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటి సందు చివర జరిగింది, వారే కావాలనే చేయించారు, అందుకే ఈ ఘటనపై స్పందించకుండా మౌనం వహిస్తున్నారన్నారు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టాలని మంత్రి కుట్ర చేశారని, ఈ అంశాన్ని హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు గ్రహించి మంత్రి వెల్లంపల్లికి రాజకీయంగా సమాధి కట్టాలన్నారు. గతంలో కూడా ముస్లిం మహిళలు పంజా సెంటర్ లో ఉద్యమిస్తుంటే వారిపై కూడా కుట్ర చేసిన అంశాన్ని ముస్లింలు నేటికీ మర్చిపోలేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం హిందూ ముస్లిం క్రిస్టియన్ ల మధ్య విభేదాలు సృష్టించడానికే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ పని చేశారని, అందుకే అన్యమత ప్రచారం పై స్పందించడం లేదని, హిందువులు ముస్లిం క్రిస్టియన్ సోదరులు ఈ అంశాన్ని గ్రహించి మంత్రి వెల్లంపల్లికి బుద్ధి చెప్పాలన్నారు. ఈఓ భ్రమరాంబ ఐ&పీఆర్ కు సంబంధం లేదంటే మరి ఎవరికి సంబంధం? మంత్రి వెల్లంపల్లికి శ్రీనివాస్ కి సంబంధం ఉందని చెప్పకనే చెప్పారా? ఈ ఘటన దసరా ఉత్సవాలులో జరగలేదా? ఎవరికి వారే తప్పించుకోవడంపై పోలీస్ శాఖ & కలెక్టర్ దృష్టి సారించి అమ్మవారి భక్తుల అనుమానాలను నివృత్తి చేసే విధంగా వాస్తవాలను బహిర్గతం చేయాలని కోరారు.
ఎమ్మెల్యే మల్లాది విష్ణు భక్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు తొమ్మిదింటి తర్వాత క్యూ లైన్ లోకి ఎవరు రమ్మన్నారు దర్శనం రేపు చేసుకోవచ్చు కదా అని ఈ ఎమ్మెల్యే చెప్పకపోతే భక్తులకి తెలియదా? బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న మల్లాది విష్ణు అన్యమత ప్రచారంపై ఎందుకు స్పందించడం లేదని, సమదానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమ్మవారి భక్తులు పులిహార ప్రసాదానికి కూడా నోచుకోకపోవడం దురదృష్టకరమని, తిరుమలలో వెంకన్న స్వామి లడ్డు ప్రసిద్ధి, అన్నవరంలో సత్యనారాయణ స్వామికి గోధుమ నూకప్రసాదం ప్రసిద్ధి, కనకదుర్గ అమ్మవారికి పులిహోర ప్రసిద్ధి ఈ దసరాకి అమ్మ భక్తులు పులిహార ప్రసాదానికి కూడా నోచుకోలేదని, ఆలయ ఈఓ అధికారులు దేవాదాయ శాఖ మంత్రి కనీసం అమ్మవారి భక్తులకు పులిహార ప్రసాదం అందించలేకపోవడం చాలా దురదృష్టకరమన్నారు. వైసీపీ నాయకులు దృష్టంతా అమ్మవారి భక్తులు కానుకలు హుండీలో వేస్తే కాంట్రాక్టల రూపంలో దోచుకోవడం పైనే ఉందని ఎద్దేవా చేశారు. బ్రాహ్మణ వీధిలో దేవస్థానానికి చెందిన కార్లలో వైసీపీ నాయకులు మంత్రికి చెందినటువంటి వ్యక్తులు ఈ కార్లను ఉపయోగించుకుంటూ అమ్మవారి దర్శనం చేస్తున్నారని ఇదంతా సబబు కాదని, వైసీపీ నాయకులకు ఎంతో కొంత దక్షిణ చెల్లించుకుని ఈ దర్శనాలు కావాలంటే బ్రాహ్మణ వీధిలో మంత్రి ఇంటివద్ద లేదా కార్యాలయం వద్దకు వెళ్లి ఇస్తే సరిపోతుందన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com