శింగనమల ( జనస్వరం ) : నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యత ఏర్పడిందని, స్థానిక ఎమ్మెల్యే ప్రజల కనీస అవసరాలను తీర్చలేదని నియోజకవర్గ జనసేన నాయకులు దంపెట్ల శివ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ శింగనమల నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు అయినప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంగా ఉందన్నారు. గార్లదిన్నె నుండి నియోజకవర్గ కేంద్రానికి రావాలంటే రోడ్డు దుస్థితి అధ్వానంగా ఉందని ఇంకా గ్రామాలకు వెళ్ళే రోడ్లు ఏవిధంగా ఉంటాయో అర్థం అవుతుందన్నారు. మండల స్థాయి అధికారుల చేతుల్లో అధికారం లేకుండా చేసి వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. వైసిపి నాయకులు అధికార దాహంతో సొమ్మును కూడగట్టుకునే యత్నాలు చేస్తున్నారని, ఎన్నికల ముందు రైతులకు అనేక హామీలు గుప్పించి అధికారం వచ్చిన తర్వాత రైతులకు స్ప్రింక్లర్లు, డ్రిప్పులు పైపులు ఇవ్వకుండా రైతులను దగా చేస్తున్నారన్నారు. శింగనమల నియోజకవర్గం అంటే కేవలం బుక్కరాయసముద్రం ఒక్కటేనా? మిగిలిన 5 మండలాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు ? నార్పల మండలంలో పట్టాలు పంపిణి చేసి దాదాపు 2 సం. గడుస్తున్నా నవరత్నాల్లో ఒక రత్నం (జగనన్న ఇల్లు ) కనుమరుగై పోయినదన్నారు. లబ్దిదారులు అద్దెలు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. అప్పో సప్పో చేసుకొని ఇల్లు నిర్మించుకుందామన్న అధికారులు అనుమతి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే మేల్కొని అభివృద్ధి పనులు చేపట్టాలని, లేదంటే రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో ప్రజలే బుద్ధి చెప్తారాణి అన్నారు.