విజయవాడ ( జనస్వరం ) : పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ పోతిన వెంకట మహేష్ గారి ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ ను పురస్కరించుకొని మహేష్ గారి ఆధ్వర్యంలో పేద, సామాన్య ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుక పంపిణీ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు పాల్గొన్నారు కార్యక్రమం కుమ్మరిపా,లెం రిలయన్స్ మార్ట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో 800 మంది ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుక అందించడం జరిగింది. ముస్లిం మత పెద్దలు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థనలు చేయడం జరిగింది అనంతరం వారికి బట్టలు బహుమానం అందించడం జరిగింది. జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర మాట్లాడుతూ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున ముందుగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా పేద సామాన్య వర్గాలకు నిరంతరం అండగా నిలవాలన్న పోతిన మహేష్ లాంటి వ్యక్తిని ప్రజలు ఆదరించాలని, అవినీతి అక్రమాలను ప్రశ్నించే ధైర్యం ఉన్న వ్యక్తి మహేష్ అని అదే విధంగా సేవాగుణం కూడా కలిగి ఉండడం చాలా గొప్ప లక్షణం అని, ఈ ప్రాంతం అవినీతికి దూరంగా అభివృద్ధికి దగ్గరగా ఉండాలి అంటే మహేష్ లాంటి వ్యక్తులను ప్రజలు ఎన్నుకోవాలి అన్నారు.
పోతిన మహేష్ మాట్లాడుతూ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ప్రతి సంవత్సరం పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ తరపున పేద, సామాన్య ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుక అందజేయడం జరుగుతుందని, పవన్ కళ్యాణ్ గారు కులాలకు మతాలకు అతీతంగా పనిచేసే వ్యక్తి, అందరిని ఆదరించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని హిందువులైన ముస్లింలైన క్రిస్టియన్ అయిన దేశం లో ఎవరు అయినా సమభావం కలిగినటువంటి గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని, గత ఆదివారం పశ్చిమ నియోజకవర్గంలోని ఒక మదర్సా కు హైదరాబాద్ కు పిలిపించి ఆ మదర్సా అభివృద్ధి కోసం ఐదు లక్షల రూపాయల విరాళాన్ని పిలిచి వారికి అందజేసిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని, ముస్లిం మైనార్టీలకు సంక్షేమం అభివృద్ధి ఒక్క పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్య పడుతుందని, ముస్లిం మైనార్టీలకు చెందినటువంటి మసీదులు దర్గాలు అన్నిటినీ కూడా అభివృద్ధి చేసే బాధ్యత జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారని, రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారని, వక్ఫ్ భూములన్నీటిని కూడా సర్వే చేయించి డిజిటలైజేషన్ చేయించి కాపాడే బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారని, మసీధ్ లు, మదర్సా ల,`దర్గాలు అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులను ఇవ్వడం జరిగిందని ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు గత పది సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని, పవన్ కళ్యాణ్ గారు కడపలో మసీదుల అభివృద్ధికి ఐదు లక్షల రూపాయలు విరాళం ఇస్తే మరి కడపలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మసీదు కైనా దర్గా కైనా ఒక్క రూపాయి అన్నా ఇచ్చారా అని ? జగన్మోహన్ రెడ్డి గారికి లక్షల కోట్లు ఉన్నా ఒక్క మసీదు అభివృద్ధి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున వక్ఫ్ భూములు కాపాడుతు మైనార్టీలు బాగుండాలని మేము ఆకాంక్షిస్తే వైసిపి నాయకులు మాత్రం వక్ఫ్ భూములను హల్వా తిన్నట్టు తినేస్తున్నారని, అటువంటి వ్యక్తులును ఉపేక్షించ వద్దని పవన్ కళ్యాణ్ గారు ముస్లిం మైనార్టీల అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని వచ్చేది జనసేన ప్రభుత్వమేనాన్నారు. 44 డివిజన్ అధ్యక్షురాలు మరియు కృష్ణ పెన్న మహిళా కమిటీ కోఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కరించడం కోసం నిరంతరం పోరాడుతున్నామని పశ్చిమంలో మైనార్టీ ఆస్తులు కాజేస్తున్న వారికి ఎవరు అండగా నిలవద్దని పోరాటాలతో పాటు అవసరమైన ప్రతిసారి ప్రజలకు సేవ చేస్తున్న పార్టీ జనసేన పార్టీ మాత్రమేనన్నారు ముస్లిం అక్కచెల్లెమ్మలకు ప్రత్యేకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసినారు.
42వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష మాట్లాడుతూ ప్రజల డబ్బులతో ఇఫ్తార్ విందు లు ఇచ్చి ysrcp నాయకులు ఫోటోలు దిగుతున్నారు, పవన్ కళ్యాణ్ గారికి ప్రజలందరూ అండగా నిలబడి జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అప్పుడు మాత్రమే పేద సామాన్య వర్గాల జీవితాలు మారుతాయి అన్నారు. విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి సయ్యద్ ముబీనా మాట్లాడుతూ భవానిపురం గాలిబ్ షాహిద్ దర్గా ఆస్తులను లూటీ చేయడానికి వెల్లంపల్లి ఉన్నారని కానీ ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చేందుకు పోతిన మహేష్ వచ్చారని, పోతిన మహేష్ ఎమ్మెల్యే అయితే ప్రతి ముస్లిం మైనారిటీ సోదరికి ఒకటి కాదు రెండు రంజాన్ తోఫాలు అందుతాయని, మనం ఎవరన్నా పొరపాటు చేస్తే మహేష్ అన్న లాంటి గొప్ప నాయకుని కోల్పోతామని, నేను మిమ్మల్ని ఒకటి అభ్యర్థిస్తున్న ఆలోచించండి కళ్లు తెరిచి హృదయంతో ఆలోచన చేయండి అన్యాయాలు అక్రమాలు చేసే వైసీపీని ఓడించి ప్రజల కోసం అండగా నిలబడుతున్న పోతిన మహేష్ ను గ్లాస్ పై గెలిపించండి. ఈ కార్యక్రమాన్ని తమ్మిన.లీలాకరుణాకర్, ఏలూరు .సాయి శరత్ ,బొమ్ము. రాంబాబు, కూరాకుల సురేష్, జల్లి. రమేష్, ఎం హనుమాన్ & శ్యాం, మల్లెపు విజయలక్ష్మి తిరుపతి అనూషాల పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో షేక్ అమిర్ భాష ,అడ్డూరి తమ్మారావు ,నేమాని సంజీవరావు, సింగినం శెట్టి రాము, కోరగంజి వెంకటరమణ నల్లబిల్లి కనకారావు, రెడ్డిపల్లి గంగాధర్ ,పొట్నూరు శ్రీనివాసరావు, ఆకుల రవిశంకర్ , నగర ఉపాధ్యక్షులు వెన్న శివశంకర్ తదితరులు పాల్గొనడం జరిగింది.