పిఠాపురం, (జనస్వరం) : పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అన్ని రంగాలలో సాధ్యమని పిఠాపురం నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలన్న దృఢ సంకల్పంతో ప్రజల ఆశీర్వాదంతో కొనసాగుతున్న రాష్ట్ర అభివృద్ధికై జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనే కార్యక్రమం శుక్రవారం గొల్లప్రోలు పట్నంలో ఏబీసీ కాలనీ 20వ వార్డు పరిధిలోని పర్యటించి ప్రతి ఇంటికి జనసేన పార్టీ రూపొందించిన ఆశయాలు, సిద్ధాంతాల కరపత్రాలను పంచుతూ, జనసేన పార్టీ సిద్ధాంతాలను వార్డు ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జి మాకినీడి శేషు కుమారి మాట్లాడుతూ ఈ కాలనీలో ఏ వీధికి వెళ్ళిన ఆడపడుచులు రోడ్డు, డ్రైనేజ్, సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయని, వర్షాకాలం అయితే ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉంటామని ఈ ప్రభుత్వంలో మాకు ఏమీ న్యాయం జరగలేదని పవన్ కళ్యాణ్ తోనే అభివృద్ధి అంటున్నారు ఇక్కడ శిలాఫలకాలు వేస్తున్నారు. కొబ్బరికాయలు కొట్టే వెళ్లిపోవడమే కానీ మా సమస్యలకు పరిష్కారం ఇన్ని సంవత్సరాలైనా అభివృద్ధి లేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాలనను ఇచ్చిన హామీలు కాలగర్భంలో తొక్కేసిన ఆయన్ను ప్రజలందరూ దృష్టిలో ఉంచుకొని రాబోయే 2024 ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు టౌన్ ప్రెసిడెంట్ వినుకొండ శిరీష, గొల్లప్రోలు రూరల్ మహిళా ప్రెసిడెంట్ వినుకొండ అమ్మాజీ, గుండ్ర హరీష్, నారపరెడ్డి రాజా, రెడ్డి శ్రీకాంత్, గణేష్, శ్రీరామ్, మనీ, నాగు, కీర్తి శివప్రసాద్, హరీష్, రాజా, శ్రీరామ్, దుర్గ, చక్రధర్, శివ, కార్తీక్, మణికంఠ, సాయి కోటి, నూకరాజు, లక్ష్మణ్, సారధి, కెలంగి వాసు, రెడ్డెం శ్రీకాంత్, రాజేష్, కర్రీ రాజేష్, కంద సాయి, అనిశెట్టి గణేష్, వెంకటేష్, రెడ్డేం శ్రీకాంత్, శివ, కాసపు శ్రీరామ్, రఘు, లక్కీ, గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి రామకృష్ణ, గారపాటి శివకొండ రావు, అడబాల వీర్రాజు, పెద్దిరెడ్ల భీమేశ్వరరావు, జన సైనికులు, నాయకులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.