Logo
Date of Publish : 03 April 2024, 4:51 pm
Editor : Sake Naresh

ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటుతోనే రాష్ట్ర అభివృద్ధి : జనసేన నాయకురాలు పెండ్యాల శ్రీలత

• కూటమి అభ్యర్థులను గెలిపించుకుందాం.

• ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటుతోనే రాష్ట్ర అభివృద్ధి.

--- జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత

        అనంతపురం, ఏప్రిల్ 03 (జనస్వరం) : జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల అంతిమ లక్ష్యం ఒక్కటే ఈ అవినీతి ప్రభుత్వన్ని గద్దె దించాలి. రాష్ట్ర ప్రజలకు సుపరి పాలన అందించాలి ఈ లక్ష్యంతోనే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేఖ ఓటుని చీలనివ్వను అని చెప్పి అటువైపుగా అడుగులు వేసి ఈరోజు కూటమి ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించారని జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత అన్నారు. బుధవారం నాడు అనంతపురం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి పార్టీల మీడియా సమావేశంలో పాల్గొన్న శ్రీలత ఈ విధంగా మాట్లాడారు. ఈరోజు అన్ని పార్టీల లక్ష్యం ఒక్కటే అవినీతి పరున్ని,రాక్షసుణ్ణి అంతం చేయాలి. సంక్షేమం మాత్రమే అడ్డుపెట్టుకొని జగన్ రెడ్డి తోపుడు బండ్ల వారితో మొదలు పారిశ్రామిక వేత్తల వరకు అందరినీ తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. మన రాష్ర్టంలో ఎక్కడ చూసినా అవినీతి అరాచకపాలనే నడిచింది. ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి ఎక్కడా నియోజక వర్గంలో అభివృద్ధి చేసిన దాఖలాలేదు. కనుక మనం అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ఈ విషయాలన్నీ గ్రహించి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థులు ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మి నారాయణ, ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకట ప్రసాద్ ల గెలుపుకోసం మేము జనసేన పార్టీ తరపున కృషి చేస్తామని తెలియజేసారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com