
సర్వేపల్లి ( జనస్వరం ) : ముత్తుకూరు మండలం, బలిజ పాలెం బిట్ 1 గ్రామంలో జరిగింది. ఆంధ్రా అభివృద్ధి జనసేనతోనే సాధ్యం కార్యక్రమంలో భాగంగా ముత్తుకూరు మండలంలోని, బలిజ పాలెం గ్రామంలో జనసేన నాయకులు ఇంటింటికీ చేరి కరపత్రాలు పంచారు. జనసేన నాయకులు మనుబోలు గణపతి మాట్లాడుతూ గ్రామాభివృద్ధి జరగాలన్నా, నిత్యావసర వస్తువుల రేట్లు తగ్గాలన్నా, జనసేన పార్టీ అధికారంలోకి రావాలని కోరారు. రాబోవు సాధారణ ఎన్నికలలో జనసేన పార్టీ గుర్తు గాజుగ్లాసు కు ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించి పవన్ కళ్యాణ్ గారిని సీఎం ని చేసుకుందామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి, ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి ఆధ్వర్యంలో జరిగింది. తాండ్ర శ్రీను పాల్గొన్నాడు.