Logo
Date of Publish : 13 February 2023, 4:48 pm
Editor : Sake Naresh

“ఆంధ్రా అభివృద్ధి – జనసేనతోనే సాధ్యం” : మనుబోలు గణపతి

             సర్వేపల్లి ( జనస్వరం ) : "ఆంధ్రా అభివృద్ధి - జనసేనతోనే సాధ్యం" కార్యక్రమం 31వ రోజు కార్యక్రమం నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం,ముత్తుకూరు మండలం, దువ్వూరి వారి పాలెం గ్రామంలో జరిగింది. ఆంధ్రా అభివృద్ధి జనసేనతోనే సాధ్యం కార్యక్రమంలో భాగంగా ముత్తుకూరు మండలంలోని,దువ్వూరి వారి పాలెం గ్రామంలో జనసేన నాయకులు ఇంటింటికీ చేరి కరపత్రాలు పంచారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు మాట్లాడుతూ మా గిరిజననుల ఇళ్ల పరిస్థితి చూడండి. మా బాధలు పట్టించుక్కునే వారే లేరు.వీధి కుళాయి నీళ్లు ఇళ్ల వాకిలి అంతా చేరిపోయింది. స్థానిక నాయకులకు చెప్పిన పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల వేళ వచ్చి ఓటు అడుగుతారు కానీ సామాన్యుల బాధలు ఈ వైసీపీ ప్రభుత్వానికి పట్టదు అంటూ వారి ఆవేదనని వ్యక్తం చేశారు. జనసేన నాయకులు మనుబోలు గణపతి మాట్లాడుతూ ఈ పరిస్థితులు మారాలనే,సామాన్యుడికి న్యాయం జరగాలనే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు. వ్యవస్థలో మార్పు కోసం,అంబేద్కర్ ఆశయాల సాధన కోసం, నగదు రహిత రాజకీయం చేస్తున్నాడు. రాబోవు సాధారణ ఎన్నికలలో జనసేన పార్టీ గుర్తు అయినా "గాజుగ్లాసు" కు ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించి పవన్ కళ్యాణ్ ని సీఎం ని చేసుకుందాం, సుసంపన్న పాలన అందిస్తాడు అని తెలియజేసారు. ఈ కార్యక్రమం జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి, ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పోలూరు పెంచల నరసింహా, నాగవేటి రమేష్, తాండ్ర శ్రీను పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com