Search
Close this search box.
Search
Close this search box.

కావలిలో అభివృద్ధి శూన్యం.. వెక్కరిస్తున్న శిలాఫలకాలు : సిద్ధు

కావలి

             కావలి ( జనస్వరం ) : కావలి నియోజకవర్గ నడిబొడ్డున బ్రిడ్జి సెంటర్లో ప్రశ్నించు! పోరాడు!! సాధించు!!! అనే నినాదంతో జనసేన నాయకుడు సిద్దు గారి ఆధ్వర్యంలో “యువతా మేలుకో” కార్యక్రమం నిర్వహించారు. అవినీతిని, అన్యాయాన్ని, అరాచకానికి భయపడే లేదని, పోరాటం చేసి అడ్డుకుంటామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆయన ఆవేశపూరితంగా మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమన్నారు. యువత మేలుకొని ప్రశ్నించకపోతే అరాచకం ప్రభలిపోతుంది అన్నారు. పట్టణంలో పెద్దపవని ఫ్లై ఓవర్ బ్రిడ్జి, మిని స్టేడియం, రామాయపట్నo పోర్టు, ఎయిర్ పోర్ట్ శిలాఫలకాలు ఈ ప్రభుత్వంలో వెక్కిరిస్తున్నాయి అన్నారు. ప్రశ్నించేతత్వాన్ని అలవరచుకున్న తనపై తప్పుడు కేసులు బనాయించి జైలులో 25 రోజులు పాటు మగ్గడం జరిగిందన్నారు. భారతదేశంలో ఏ కులమైన, నాయకులైన, అధికారులైన డా. బి. ర్ అంబేడ్కర్ వ్రాసినటువంటి రాజ్యాంగంలో పనిచేస్తారు కానీ మన కావలిలో కొందరి అవినీతి పరుల రాజ్యాంగం నడుస్తుందన్నారు. వచ్చే 2024 ఎన్నికలలో నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిగా ఓడిపోయేది కావలి వైసీపీ సీటు అని ఆయన సవాల్ విసిరారు. అవినీతి అరాచక శక్తులను చరమగీతం పాడాలన్నారు. కావలి నియోజకవర్గ యువతను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి కోసం ఈ రోజు మీ ముందుకు వచ్చానన్నారు. పోలీసులని అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులు భనాయిస్తున్నారని అధికారం ఎవ్వరికి శాస్వితం కాదన్నారు. ప్రశ్నిస్తే పోయేదేం లేదు యధవ భానిస సంకెళ్లు తప్ప అని నాలాగ ప్రతి ఒక్కరూ కావలి నియోజకవర్గ సమస్యలపై బలంగా ప్రశ్నిoచి పోరాడదామని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way