Search
Close this search box.
Search
Close this search box.

సయ్యద్ షా ఖాదరి, సయ్యద్ అలీ హుస్సేన్ షా కాదరి దర్గాలను అభివృద్ధి చేయండి

– 2016 పుష్కరాలు సందర్భంగా దర్గాను కొంతమేర తొలగించారు నాటి నుంచి నేటి వరకు పట్టించుకున్న ప్రభుత్వం లేదు.
– కొన్ని దేవాలయాలకు నామమాత్రంగా శంకుస్థాపన చేశారు దర్గా అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు.
– ముస్లిం మైనార్టీలు అంటే అంత చిన్న చూపా?
– దర్గా అభివృద్ధి కోసం కేటాయించిన 65 లక్షలులో ఒక్క పైసా అయినా ఖర్చు చేశారా!
– భక్తులకు వసతి గదులు టాయిలెట్స్ కూడా లేవు.
– దర్గాల పరిరక్షణ కమిటీ పేరుతో దర్గా భూములను కబ్జా చేయాలని కాజా ప్రయత్నం చేస్తున్నారు.
       విజయవాడ, (జనస్వరం) : అశోక స్తంభం బ్యారేజ్ వద్ద ఉన్న సయ్యద్ షా ఖాదరి మరియు సయ్యద్ అలీ హుస్సేన్ షా ఖాదరి దర్గాల ఉరుసు గంధం మహోత్సవమునకు అతిథిగా జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ హాజరయ్యారు. రెండు దర్గాలలో చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేసినారు. అనంతరం మీడియా మాట్లాడుతూ రెండు దర్గాల అభివృద్ధిని పూర్తిగా ప్రస్తుత వైసిపి ప్రభుత్వం విస్మరించిందని స్థానిక ఎమ్మెల్యే ముస్లిం మైనార్టీలు అంటే చిన్న చూపు వలనే ఈ దర్గాల అభివృద్ధిపై ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని పుష్కరాల సమయంలో తీసివేసిన దేవాలయాలకు శంకుస్థాపన మాత్రమే చేశారని దర్గాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని, గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన 65 లక్షల రూపాయల నిధులలో ఒక్క పైసా నేటి వరకు ఖర్చు చేయలేదని అదేవిధంగా రోడ్డు వాడిని లో భాగంగా 1000 గజాలు ఈ దర్గా కోల్పోయిందని అందుకు సంబంధించిన నష్టపరిహారం నేటి వరకు అందలేదని అదేవిధంగా దర్గా వద్ద ఏర్పాటుచేసిన ప్రకాష్ ఆర్ట్స్ డిజైన్ బోర్డుకు వచ్చిన లీవ్స్ అమౌంట్ కూడా వక్బోర్డు వద్దనే ఉండిపోయాయని, రోడ్డుకి ఎనిమిది నుంచి పది అడుగుల లోతున ఈ రెండు దర్గాలు ఉండడం వలన నీరు లోపలికి చేరి భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తుందని, డ్రైనేజ్ నీరు కూడా కెనాల్ లో కలవకుండా కొన్ని సమయాల్లో దర్గా లోపలికి వచ్చేస్తుందని ఇది దర్గా యొక్క పవిత్రతను దెబ్బతీస్తుందని అయినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే ఈ దర్గాల అభివృద్ధిని పూర్తిగా విస్మరణించడం ఏమిటో అర్థం కావడం లేదని, కొంతమంది దర్గా అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతున్నారని వారు దర్గా అభివృద్ధి కోసం కృషి చేయాలి గాని అడ్డుపడితే భగవంతుడు ఉపేక్షించడని అశోక స్తంభం వద్దనించే గుర్రాలు లోపలికి వచ్చి గంధం మహోత్సవం ప్రారంభం అయ్యేలా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వక్ఫ్ బోర్ఫ్ చెందిన నాయకులు కృషి చేయాలని, దర్గాల అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చే వారిని అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారని, అదేవిధంగా వక్బోట్ డైరెక్టర్ కాజా దర్గాల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేస్తానని మాట్లాడ్డం చాలా హాస్యాస్పదంగా ఉందని, ఏనాడైనా దర్గాల అభివృద్ధి కోసం కృషిచేయిని కాజా పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేస్తున్నది కేవలం దర్గాలు మసీదులకు చెందిన విలువైన ఆస్తులను కబ్జా చేసేందుకే ఈ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేస్తున్నారని ఈ రెండు దర్గాల అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎంపీ కేశినేని శ్రీనివాస్ ఎమ్మెల్సీ రోహల్లాలు కృషి చేయాలని లేని పక్షంలో దర్గాని ఏవిధంగా అభివృద్ధి చేయాలో అందుకు తప్పక కృషి చేస్తామని మహేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ అధ్యక్షులు తమ్మిన లీలా కరుణాకర్, సింగినంశెట్టి. రాము గుప్తా, పొట్నూరి . శ్రీనివాసరావు, ఏలూరు. సాయి శరత్, ఆకుల రవిశంకర్, విజయవాడ నగర సహాయ కార్యదర్శి గను శంకర్ నగర అధికార ప్రతినిధి స్టాలిన్ శంకర్ నాయకులు దారా. రాము, రామకృష్ణ, షేక్ పండు, బావిశెట్టి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way