Logo
Date of Publish : 29 October 2020, 11:31 am
Editor : Sake Naresh

హరిశ్చంద్రపురం రైల్వేస్టేషన్ ను అబివృద్ది చెయ్యండి : టెక్కలి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్ కుమార్

హరిశ్చంద్రపురం రైల్వేస్టేషన్ ను అబివృద్ది చెయ్యండి : టెక్కలి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్ కుమార్

                       టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం రైల్వేస్టేషన్ ను నేడు జనసేన టెక్కలి నియోజకవర్గ ఇంచార్జ్ కణితి కిరణ్ కుమార్ గారు సందర్శించి పరిసరాలను పరిశీలించడం జరిగింది. 16 వ నంబర్ జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ ఈ రైల్వేస్టేషన్ అభివృద్ధికి అస్సలు నోచుకోలేదని కనీస సౌకర్యాలు అయిన తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్, స్టేషన్ కు  సరైన రహదారి, సరైన వీధి దీపాలు కూడా లేకుండా అభివృద్ధికి ఆమడదూరంలో ఉండడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రైల్వేస్టేషన్ కనుక అబివృద్ది చెంది ప్రధాన రైళ్లు ఆగితే చుట్టుపక్కల దాదాపు 47 గ్రామాల ప్రజలకు రైతులకు మరియు వాణిజ్యపరంగా కూడా చాలా ఉపయోగపడుతుంది. 1946 లో స్వాతంత్య్రం రాకముందే ఉత్తమ రైల్వేస్టేషన్ గా అవార్డ్ పొందిన ఘన చరిత్ర ఉన్నప్పటికి, నేటికీ అభివృద్ధికి దూరంగా ఉండిపోయింది. ప్రస్తుత ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలను వాణిజ్యపరంగా అబివృద్ది చేయాలని ఆశిస్తున్న ఈ తరుణంలో ఈ రైల్వేస్టేషన్ అబివృద్ది చెందితే ఈ ప్రాంత రైతాంగానికి, వర్తకులకు, ప్రజలకు ఉపయోగపడుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హరిశ్చంద్రపురం జనసేన ఎంపీటీసీ అభ్యర్థి రమేష్, తర్లీపేట ఎంపీటీసీ అభ్యర్థి శ్రీను, ముడిదాన రాంప్రసాద్, కొత్తూరు హరి, లఖినేని చైతన్య, సాయి, స్వాధీన్ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com