చంద్రగిరి ( జనస్వరం ) : చంద్రగిరి జనసేన ఇంఛార్జ్ దేవర మనోహర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాయలసీమ, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే అత్యంత ప్రాధాన్యత ఉన్న నియోజకవర్గం చంద్రగిరి, రాయలు వారు ఏలినట్టి ఈ చంద్రగిరిని ఈరోజుకి అంధకారంలో, అభివృద్ధి లేకుండా చేసిన ఘనత చెవిరెడ్డి గారికే చెందుతుంది అనే చెప్పేదానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, మీకన్నా 50 సంవత్సరాలు వయస్సు కలిగిన వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ఎంతో ముందు చూపుతో తన అనుభవాన్ని జోడించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా లేక నవ్యాంధ్రప్రదేశ్ అయినా అభివృద్ధి వైపు నడిపిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, అటువంటి వ్యక్తిని అవహేళన చేస్తూ తాత, తాత అని సంబోధించే సంస్కృతి మీది. మీ తాత గారు మరియు చంద్రబాబు గారు కలిసి చదువుకుంటే మీ తాత గారు ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయారు...? ఎంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి ఒక పక్క మరోపక్క ఎవరి అండదండలు రాజకీయ గురువులు లేక ఒంటరిగా వచ్చి దశాబ్ద కాలం పైగా ప్రజల మనలను పొందిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరో పక్క కలిసి రాష్ట్ర ఎన్నికల అధికారులకు చంద్రగిరిలో జరిగే దొంగ ఓట్ల గురించి నివేదిక ఇస్తే కనీసం ఒక మండలానికి పరిమితమైన కొందరు ప్రశ్నించడం హాస్యాస్పదం. 2019 లో మీ వయస్సు 20 సంవత్సరాలు అంటే మొదటి ఓటు వినియోగించుకున్నారు, అప్పుడే ఒక పోలింగ్ బూత్ మొఖం చూడటం కూడా,అలాంటిది మీరు ఎంతో అపార రాజకీయ అనుభవం ఉన్న ఇద్దరు దిగ్గజాల గురించి మాట్లాడటం హాస్యాస్పదం మరియు నేను కలలో కూడా ఊహించలేదు. చంద్రగిరిని చెవిరెడ్డి ఏమి అభివృద్ధి చేశారని ప్రజలు వలసలు వచ్చి ఇక్కడ నివసిస్తారు, భారీ పరిశ్రమలు తెచ్చారా, ఐఐటీ కాలేజీలు కట్టారా, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లు పెట్టరా, పర్యావరణ అభివృద్ధి చేశారా....ఏమి చేశారని ప్రజలు ఇక్కడికి వచ్చి నివసించాలనుకుంటారు. గత పదేళ్లుగా చంద్రగిరిలో చెవిరెడ్డి ఉన్నారు కానీ 2014 లో ఎలా వుందో ఈరోజుకి అలానే ఉంది ఎటువంటి మార్పు లేదు, నా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు మీరు ఏమి చేశారని ఈరోజు ఓట్లు అడగడానికి వస్తారు. తాయిలాలు ఇచ్చి ప్రజలను కట్టిపడేస్తే చాలు ప్రజలు ఏ అభివృద్ధి గురించి అడగరనే ధీమాతో ఇన్నేళ్ళు నెట్టుకొచ్చారు, ఇక అది చెల్లదు మీరు ఇచ్చే స్వీట్ బాక్సులు, గోడ గడియారాలు నా చంద్రగిరి నియోజకవర్గ ప్రజల జీవితాలు మారవు... 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కనీసం నా చంద్రగిరి ప్రజలకు బస్టాండ్ కట్టించలేకపోయారు మీరు కూడా అభివృద్ధి గురించి నా ప్రజలు అని మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు పదేళ్ళలో చెయ్యలేని అభివృద్ధిని రానున్న జనసేన - టిడిపి ప్రభుత్వంలో చేసి చూపిస్తామని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com