Logo
Date of Publish : 28 November 2025, 9:16 pm
Editor : Sake Naresh

విశ్వం స్కూల్లో ‘దేవగుడి’ చిత్ర ట్రైలర్ విడుదల

తిరుపతి, నవంబర్ 28, జనస్వరం : "దేవగుడి" చిత్ర ట్రైలర్ విడుదల తిరుపతిలో శుక్రవారం ఘనంగా జరిగింది. తిరుపతి జీవకోన లోని విశ్వం హైస్కూల్లో విశ్వం విద్యాసంస్థల అధినేత, అపుస్మా రాయలసీమ జోన్ అధ్యక్షులు డా. ఎన్.విశ్వనాథ్ రెడ్డి, అకడమిక్ డైరెక్టర్ ఎన్. విశ్వచందన్ రెడ్డి, విద్యార్థుల సమక్షంలో చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదల చేసింది. డిసెంబర్ 19న 'దేవగుడి' చిత్రం విడుదల కానుంది. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సినిమా హీరో అభినవ్ శౌర్య, హీరోయిన్ అనుశ్రీ, చిత్ర నిర్మాత, దర్శకుడు బెల్లం రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ట్రైలర్ను విడుదల చేయడంతో పాటు గాయని చిత్ర ఈ సినిమాలో పాడిన పాటను సైతం విడుదల చేశారు. హీరో కావాలని 12 ఏళ్ల పాటు కష్టపడ్డానని, ప్రేక్షకులందరూ తనను ఆశీర్వదించాలని హీరో అభినవ శౌర్య కోరారు. విద్యార్థుల కేరింతల నడుమ హీరోయిన్ అను శ్రీ సినిమాలో కొన్ని డైలాగులు చెప్పారు. దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, డిసెంబర్ 19 విడుదల కరుణ ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా విడుదలకు రెండురోజుల ముందుగానే తిరుపతిలో ప్రివ్యూ షో వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అపుస్మా నాయకులు వీ.ఆర్. రెడ్డి, రవీంద్ర నాథ్ రెడ్డి, రామకృష్ణ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, పాపిరెడ్డితో పాటు చిత్ర యూనిట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com