పూతలపట్టులో అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీదేవికి ఆర్థిక సహకారం అందించిన జనసేన నాయకులు దేవా కిషోర్
చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి మండలం, మాదిరెడ్డి పల్లి గ్రామము ఎస్సీ కాలనీలో అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీదేవి అనే ఒక నిరుపేద మహిళలకు ఆర్థిక సాయంగా జనసేన పూతలపట్టు నాయకులు సి.ఎల్. దేవా కిషోర్ 15000 వేల రూపాయలు సాయం చేయడం జరిగింది. దేవా కిషోర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. కరోనా కష్టకాలంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేవ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి సేవలు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు జనసేన నాయకులు సి. ఎల్. దేవా కిషోర్ గారు, ఓం ప్రకాష్ (JP) , ఎంకే వేణు యాదవ్, నాగార్జున, కిరణ్, ఢిల్లీ భాష, మున్నా తదితరులు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.