తెలంగాణ ( జనస్వరం ) : కేటీపీఎస్ నందు హయర్ వెహికల్ డ్రైవర్లుగా గత 15 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నామని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2016 అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు కేటీపీఎస్ కర్మాగారంలో ఎవరైతే కార్మికులు విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళందరినీ ఆర్టిషన్ గా గుర్తించడం జరిగింది. ఆ ప్రక్రియలో హయ్యర్ వెహికల్ డ్రైవర్స్ అయిన మాకు కేటీపీఎస్ యాజమాన్యం అన్యాయం చేసిందని జనసైనికుడు దేవా గౌడ్ సురేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టిషన్లుగా గుర్తించడానికి యాజమాన్యం ఏవైతే విధివిధానాలను అర్హతలను రూపొందించిందో అటువంటి అన్ని అర్హతలను ( గేట్ పాస్, EPF, Agreement, అన్యువల్ మెయింటెనెన్స్) అన్ని మేము కలిగి ఉన్నామని అన్నారు. ఇలా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఈరోజు వరకు కేటీపీఎస్ యాజమాన్యం మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా అన్యాయానికి గురిచేస్తుంది. ఈ విషయమై ఇప్పటివరకు గౌరవ యాజమాన్యానికి గౌరవ ప్రజాప్రతినిధులను ఎంతమందిని కలిసిన మాకు న్యాయం జరగలేదు. కారు గుర్తు పెట్టుకున్న మన బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీపీఎస్ లో గత 11 సంవత్సరాల నుండి కార్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాము ఆర్టిజన్ విషయంలో మాకు అన్యాయం చేసిందని వాపోయాడు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com