
జలుమూరు, (జనస్వరం) : ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం జలుమూరు మండలం శ్రీముఖలింగం సమీపంలో ఉన్న కరకవలస కొండపై పద్మనాభ కొండపై విగ్రహాలు ధ్వంసం చేయడంపై పరిశీలనకు వచ్చిన జనసేన నేతలను, అభిమానులను పోలీసులు అడ్డుకోవడంపై త్రీవంగా ఖండిస్తున్నామని నరసన్నపేట నియోజకవర్గం జనసేనప్రతినిధి, జయరాం గారు ఆవేదన వ్యక్తపరిచారు. కొండపై జరిగిన దుర్ఘటనలు చూసేందుకు సంఘటనా స్థలానికి వచ్చిన మమ్మల్ని, కొండపైకి వెళ్లకుండా అడ్డుకోవడం చాలా దృరదృష్టకరమని జయరాం గారు ఆందోళన వ్యక్తపరిచారు. ఇటువంటి దుర్మార్గ, అరాచక ఘటనలు జరుగుతుంటే, పోలీసులు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం విచారకరమని ఆయన ఆవేదన చెందారు. ఇటువంటి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతీ పౌరుడు, గమనించాలని జయరాం గారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు, కోమనాపల్లి, శ్రీ ముఖలింగం కార్యకర్తలు, జలుమూరు మండలం అందవరం ఎంపిటిసి అభ్యర్థి, తిరుపతిరావు, జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.