Logo
Date of Publish : 16 May 2022, 7:29 am
Editor : Sake Naresh

రాయలసీమలో తీరని దాహం, పట్టించుకోని ప్రభుత్వం : దారం అనిత

          మదనపల్లి ( జనస్వరం ) : చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత పత్రికాముఖంగా మాట్లాడుతూ రాయలసీమ కరువు ప్రాంతమని, వేసవికాలంలో మంచినీటి పథకాల నుండి తాగునీటి సరఫరా అవుతున్న వీటి నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందన్నారు. ఫలితంగా దాహం తీర్చుకునేందుకు పట్టణ జనం నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ పథకాలకు ప్రభుత్వం అరకొరగా వ్యయం చేచేసినా ప్రయోజనం లేకపోయింది. చాలా ప్రాంతాల్లో పైపులైన్లు బాగా దెబ్బ తిన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో మురుగు కాలువ లోనే పైపులైన్లు ఉన్నాయి. దీంతో తాగునీరు కలుషితం అవుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. తాగునీటి అవసరాలకు నీటిని కొనుగోలు చేస్తున్నారు. 14, 15 ఆర్థిక సంఘం నిధులు ఉన్నప్పటికి తాగునీటి పైపులైన్ల విస్తరణ నీటిశుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడంలో అధికారులు అశ్రద్ధ వహిస్తున్నారు. రాయచోటి ప్రాంతంలో రోజుకు అవసరమైన నీరు 1.50 కోట్ల లీటర్లు. రోజుకి సరఫరా అవుతున్న నీరు 80 లక్షల లీటర్లు మాత్రమే. అదేవిధంగా మదనపల్లిలో సరఫరా చేయాల్సిన నీరు 2.25 కోట్లు లీటర్లు. రోజుకు 75 లక్షల లీటర్లు మాత్రమే సరఫరా అవుతున్నాయి. పురపాలక సంఘాలు తాగునీటి అవసరాలకు అనుగుణంగా పైప్ లైన్లను విస్తరించడం లేదు. మొదట్లో వేసిన గొట్టాల ద్వారా మంచి నీటిని సరఫరా చేస్తున్నారు. కారణంగా డిమాండ్ మేరకు చేయలేకపోతున్నారన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com