దెందులూరు ( జనస్వరం ) : దెందులూరు శాసనసభ్యులు కొఠారు.అబ్బయ్య చౌదరి గారు పలుమార్లు నియోజకవర్గ అభివృద్ది గురించి ప్రగల్భాలు పలుకుతున్న తీరును ప్రశ్నించడానికి జనసేన పార్టీ, దెందులూరు నియోజకవర్గ నాయకులు కొఠారు ఆదిశేషు మీడియా సమావేశం ఏర్పాటుచెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా కొఠారు ఆదిశేషు మాట్లాడుతూ, MLA ఎన్నిక కాబడిన 4 సంవత్సరాలకు సుప్తావస్థ నుండి మేల్కొని ముఖ్యమంత్రి గారికి అన్న అది కావాలి అన్న ఇది కావాలి అని అడగడంలో అర్థం లేదన్నారు. ప్రజల సమస్యలు తీర్చే ఉద్దేశం ఉంటే తొలినాళ్ళ నుండే పట్టించుకోవాలి గాని మళ్ళీ ఎన్నికల దగ్గర పడేసరికి నిద్రలేచి హడావిడి చెయ్యడం సరికాదన్నారు. అబ్బయ్య చౌదరి గారు ఈ ప్రభుత్వం స్త్రీ పక్షపాత ప్రభుత్వం, మహిళా సాధికారతే ధ్యేయంగా పనిచేస్తున్నారు అనడం హాస్యాస్పదని, అటువంటప్పుడు విజయరాయి జనసేన వీరమహిళ చిన్నమ్మ చేపలదుకాణం ఎందుకు దౌర్జన్యంగా తొలగించారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సభకు రాకపోతే మంజూరు చేసిన పధకాలు నిలిపివేస్తామని మహిళలను బెదిరించి తీసుకెళ్లారని, న్యాయంపల్లి గ్రామంలో అలా బలవంతంగా వెళ్ళిన మహిళ 3ఏళ్ళ పసికందుని ఇంట్లో వదిలివెళ్ళడం వలన ఆ పసికందు నీటితొట్టిలో పడి మృత్యువాత పడ్డాడు అని, ఆ కుటుంబానికి ఎవరు న్యాయం చేస్తారని ఇదేమి దౌర్జన్య పాలన అని ప్రశ్నించారు. వృత్తి నైపుణ్యం మీద అవగాహన తరగతులు ఎక్కడ జరుగుతున్నాయి??కుట్టు మిషన్లు, చిల్లర దుకాణాలు ఎలా మహిళసాధికారతో, వాటి వల్ల జీవనప్రమాణాలు ఏవిధంగా పెరుగుతున్నాయో వివరించమని అన్నారు. అన్నా ఇది SC సామాజిక వర్గం ఎక్కువ ఉన్న నియోజకవర్గం అన్నా అని ముఖ్యమంత్రికి చెప్పిన అబ్బయ్య చౌదరి దెందులూరు నియోజకవర్గంలో వరుసగా అదే దళిత సామాజికవర్గ మహిళల మీద దాడులు జరిగినప్పుడు బాధ్యత ఎందుకు వహించలేదు అని తిట్టిపోసారు. 2 లక్షలకోట్లు సంక్షేమ పధకాలకు ఖర్చుపెట్టామన్న ప్రభుత్వం, దానిని అభివృద్ది రూపంలో చూపించడంలో విఫలమైందన్నారు, ఆ ధనం అంతా ఎటు తరలించారో చెప్పమన్నారు. 4 సార్లు ఇసుక పాలసీని మార్చి మార్చి చివరికి వారు దోచుకునేలాగా రూపుదిద్దించికుని ప్రజల సొమ్ము దోచుకోవడమే కాకుండా ప్రభుత్వానికి ఆదాయం లేకుండా చేసారన్నారు. పోలవరం కాలువ 40కి.మీ మేర నియోజకవర్గంలో వెళుతున్నా రైతులకు ఒక్క చుక్క నీరు కూడా అందించే ప్రయత్నం కూడా చెయ్యకపోవడం శాసన సభ్యుడి పాలనా వైఫల్యం అని ఎద్దేవా చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.